స్కూబా డైవర్‌గా సోనాక్షి సిన్హా.. మాల్దీవుల్లో లైసెన్స్ సొంతం చేసుకొన్న బ్యూటీ
కరోనావైరస్ కారణంగా దాదాపు 6 నెలలకుపైగా ఇంటికే పరిమితమైన సినీ తారలు ఇప్పుడు విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. అయితే సోనాక్షి సిన్హా తన జీవితంలో మరో అరుదైన విషయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు.
మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లిన సోనాక్షి స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందారు. ఈ డైవింగ్‌లో శిక్షణ పొందడమే కాకుండా స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ కూడా పొందడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని సొనాక్షి సిన్హా తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

సముద్ర తీరాలంటే నాకు చెప్పలేనంత ఇష్టం అని వెల్లడించింది. అంతేకాకుండా స్కూబా డైవింగ్ శిక్షకుడితో ఉన్న ఫోటోను పోస్టు చేసింది. సోనాక్షి సిన్హా సాధించిన ఘనతపై స్నేహితులు, అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తన తోటి నటీనటులు సునీల్ గ్రోవర్, హ్యుమా ఖురేషీ ప్రశంసిస్తూ. పోస్టులు పెట్టారు.

సోనాక్షి సిన్హా సాధించిన ఘనతను ప్రశంసిస్తూ హ్యూమా ఖురేషి చేసిన పోస్టును అతియా శెట్టి, దియా మిర్జా, పులకిత్ సామ్రాట్, హ్యుమా ఖురేషి, కాజల్ అగర్వాల్, షాహిద్ కపూర్, రియా కపూర్, కునాల్ ఖేమ్, కృతి సనన్, రకుల్ ప్రీత్ సింగ్, తనిషా ముఖర్జీ లైక్ చేశారు. ఇదిలా ఉండగా, సోనాక్షి చేసిన పోస్టుకు 2 లక్షల లైకులు వచ్చాయి.


Click it and Unblock the Notifications











