సోనాక్షి.. నీ బికినీ.. ప్యాంటీ చూపించవా? జబర్దస్త్ జవాబుతో నెటిజన్‌కు సోనాక్షి సిన్హా చుక్కలు!

ప్రతీ ఒక్కరి జీవితాల్లో సోషల్ మీడియా ప్రభావం భారీగా పెరిగి పోతుండటంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలకు ప్రైవసీ కరువైపోతున్నది. ప్రతీ రోజు ఎవరో ఒకరు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురి అవుతూనే ఉన్న వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలోను కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి బారిన పడిన వారిలో సోనాక్షి సిన్షా పడ్డారు. తాజాగా ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటంటే...

 బ్లాక్ బస్టర్‌తో సోనాక్షి సిన్హా

బ్లాక్ బస్టర్‌తో సోనాక్షి సిన్హా

సల్మాన్ ఖాన్‌తో కలిసి దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్‌తో సోనాక్షి సిన్హా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత కమర్షియల్ దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ను ఎంచుకోవడం వల్ల ఆమె సక్సెస్‌కు దూరంగా ఉన్నారు. అయితే తన పరిస్థితిని, కెరీర్‌పై తొందరగానే అవగాహన కల్పించుకొన్న ఆమె రౌడీ రాథోడ్, ఆర్ రాజ్‌కుమార్ లాంటి సినిమాలతో కమర్షియల్‌గా హిట్లు కొట్టేశారు.

 భుజ్ చిత్రంతో విజయాన్ని అందుకొంటూ

భుజ్ చిత్రంతో విజయాన్ని అందుకొంటూ

అయితే ప్రస్తుతం తన చిత్రాలను ఆచీ తూచి ఎంపిక చేసుకొంటూ కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటున్నారు. దబాంగ్ 3 చిత్రంతో పెద్దగా హిట్ సాధించలేకపోయిన ఆ ముద్దుగుమ్మ.. తాజాగా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. అలాగే ప్రస్తుతం కాకుడా అనే చిత్రంలో నటిస్తున్నారు.

చిరంజీవి సరసన సోనాక్షి

చిరంజీవి సరసన సోనాక్షి

ఇక సోనాక్షి సిన్హా ఇప్పటికే లింగా సినిమాతో దక్షిణాదిలో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్లాన్స్ చేసుకొంటున్నారనే వార్త తెలుగు సినీ మీడియాలో వైరల్ అవుతున్నది. చిరంజీవి నటించే చిత్రంలో సోనాక్షి హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ వార్తపై అటు సోనాక్షి గానీ, ఇటు చిరంజీవి సినిమా వర్గాలు కానీ క్లారిటీ ఇవ్వలేకపోయాయి.

ఏదైనా అడిగేయండి అంటూ సోనాక్షి

ఏదైనా అడిగేయండి అంటూ సోనాక్షి

ఇదిలా ఉంటే.. సోనాక్షి సిన్హా Ask Me Anything అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించారు. అయితే కొందరు మర్యాదగా ప్రశ్నలు సంధించినప్పటికీ.. కొందరు తుంటరి నెటిజన్లు ఏదైనా అడగమనడంతో చిలిపి ప్రశ్నలు సంధించారు. నీ కాలు చూపించు అంటూ అడిగితే కుదరదు అని ముక్తసరిగా జవాబిచ్చారు. అలాగే నీ బికినీ, ప్యాంటీలు చూపించవా అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె బికినీ, ప్యాంటీ ఫోటోల బొమ్మలు షేర్ చేశారు. దాంతో నెటిజన్లు ఆమె సమయస్పూర్తికి కంగు తిన్నారు.

Recommended Video

Bullet Satyam Movie Trailer
నన్ను పెళ్లి చేసుకొంటావా బ్యూటీ అంటూ

నన్ను పెళ్లి చేసుకొంటావా బ్యూటీ అంటూ

ఇక సోనాక్షితో తింగరి ప్రశ్నలతో నెటిజన్లు హంగామా చేశారు. ఏమి తింటే బరువు తగ్గుతామో చెప్పు అని అడిగితే.. గాలి తిను.. వెంటనే బరువు తగ్గిపోతావు అంటూ చమత్కరించారు. ఇంకా ఆమె నెటిజన్లు అభిమానులతో ఉత్సాహంగా సంభాషించడానికి మొగ్గుచూపుతూ.. నేను ఈ రోజు చాలా ఖాళీగా ఉన్నాం. మనం మనస్పూర్తిగా మాట్లాడుకొందామా అని అడగడం చాలూ.. ఓ నెటిజన్ .. నన్ను పెళ్లి చేసుకొంటావా? అంటూ ప్రశ్నించాడు. దాంతో ప్రస్తుతం నేను ఇన్స్‌టాగ్రామ్‌లో చేసే పెళ్లి ప్రతిపాదనలను అంగీకరించడం లేదు అంటూ సోనాక్షి షాక్ ఇచ్చింది. అలా సరదాగా, చిలిపిగా, తుంటరిగా Ask Me Anything లైవ్ గడిచిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X