అర్ధరాత్రుళ్లు ఆ ప్లేస్‌కి తీసుకెళ్లి.. అతని వల్లే ప్రెగ్నెన్సీ.. ఆధారాలతో బయటపెట్టిన హీరోయిన్

నటీనటుల ప్రేమ, పెళ్లితో పాటు వారి ప్రెగ్నెన్సీపైనా రూమర్స్ వస్తూనే ఉంటాయి. నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతాయి. ఎవరైనా హీరోయిన్ కాస్త బొద్దుగా మారి, పొట్ట ఎత్తుగా కనిపిస్తే చాలు ఉన్నవి లేనివి కలిపి రాసేస్తారు. ప్రతి హీరోయిన్‌కు ఇలాంటివి అనుభవమే. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. గత కొద్దిరోజులుగా సోనాక్సి ప్రెగ్నెన్సీపై కథనాలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

దబాంగ్‌తో పాపులారిటీ
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా.. దబాంగ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ సినిమాలతో వరుస హిట్స్‌ను తన సొంతం చేసుకున్నారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం నెంబర్స్‌తోనూ సోనాక్షి ఒక ఊపు ఊపారు. గ్లామర్ షో చేసినా కథాబలం ఉన్న సినిమాలనే చేస్తూ అభిరుచి గల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాడి హీరామండీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.

Sonakshi Sinha Reveals Zaheer Iqbal is Reason for her pregnancy rumours

జహీర్ ఇక్బాల్‌తో లవ్ మ్యారేజ్
అందరు హీరోయిన్ల మాదిరిగానే సోనాక్షి వ్యక్తిగత జీవితం పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆదిత్య ష్రాఫ్, బంటీ సాజెదా, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్‌లతో ఆమె డేటింగ్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. వీటిలో కొన్ని నిజాలు లేకపోలేదు. అయితే డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో పడిన సోనాక్షి ఆయనను పెద్దల అంగీకారంతో 2024 జూన్ 23న వివాహం చేసుకున్నారు. ఇటీవలే తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ జంట.. వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. వరుసపెట్టి ఫారిన్ ట్రిప్‌లు వేస్తూ జోష్‌లో ఉంది. సోనాక్షి కూడా ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌ని ఫినిష్ చేసి భర్తతో ఎక్కువ సమయం గడిపేందుకే ప్రాధాన్యతనిస్తోంది.

సోనాక్షి ప్రెగ్నెన్సీపై గాసిప్స్
ప్రస్తుతం బాలీవుడ్‌లో సెలబ్రెటీ కపుల్స్ గుడ్ న్యూస్ చెబుతుండటంతో సోనాక్షి- జహీర్‌లు కూడా ఎప్పుడు ఆ వార్త చెబుతారా? అని ఇరు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. గతేడాది దీపావళి సందర్భంగా ముంబైలో జరిగిన దివాళీ బాష్‌లో సోనాక్షి కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో పాటు పొట్ట భాగం ముందుకొచ్చినట్లుగా ఉంది. దీంతో సోనాక్షి గర్భం దాల్చారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఏదో ఒక సమయంలో సోనాక్షి ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ గాసిప్స్‌‌పై తాజాగా సోనాక్షి సిన్హా స్పందించారు.

నా ప్రెగ్నెన్సీకి ఆయనే కారణం
మీడియాలో వస్తున్నట్లుగా తాను గర్భం దాల్చలేదని, కేవలం బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. తన భర్త జహీర్ అర్థరాత్రి 12 గంటలకు కూడా బయట ఏదో ఒకటి తినిపించేవాడని తెలిపింది. ఎంత అర్ధరాత్రి అయినా ఆకలేస్తుందా? ఏమైనా తింటావా అని అడుగుతూ మెసేజ్‌లు పెట్టేవాడని సోనాక్షి వెల్లడించారు. అలా ప్రతిరోజూ తినడంతో విపరీతంగా బరువు పెరిగినట్లుగా దబాంగ్ బ్యూటీ పేర్కొన్నారు. ఈ మేరకు భర్త జహీర్‌తో చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ తాలూకా స్క్రీన్ షాట్లను సోనాక్షి షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Read more about: sonakshi sinha zaheer iqbal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X