అందుకే స్విమ్ సూట్ వేసుకోను.. దబాంగ్ బ్యూటీ షాకింగ్ రీజన్
ఇండియన్ సినిమా దగ్గర కొందరు హీరోయిన్స్ తాము ఇక్కడే సర్వైవ్ అయ్యి క్రేజ్ తెచ్చుకున్నప్పటకీ తాము మార్కెట్ అందుకున్న సినిమా ఇండస్ట్రీల పైనే అలాగే మన దేశంపై కూడా పలు కామెంట్స్ చేసిన వారు లేకపోలేరు. ఇలా దక్షిణాది సినిమా నుంచే కాక నార్త్ సినిమా నుంచి కూడా ఈ తరహా హీరోయిన్స్ కొందరు కనిపిస్తూ ఉంటారు.
మరి ఇలాంటి వారి విషయంలో ఒకోసారి నెటిజన్స్ కి కూడా వాళ్ళ పట్ల ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు వారి రిక్వైర్మెంట్స్ ఏంటో అనేవి అర్ధం కావు. కాగా ఇపుడు ఇలాంటి పరిస్థితిలోనే నెటిజన్స్ ఓ టాప్ హీరోయిన్ విషయంలో ఉన్నారని చెప్పాలి. కాగా ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. కాగా సోనాక్షి సిన్హా ఇంటర్ రిలీజియన్ పెళ్లి చేసుకోవడం పైనే పలు విమర్శలు కూడా వచ్చాయి.

దీనికి తోడు ఆ పెళ్లి కారణం గానే ఇటీవల మహా కుంభమేళాకి కూడా వెళ్ళలేదు అంటూ పలు కామెంట్స్ వినిపించాయి. అయితే హిందీ హీరోయిన్స్ అంటేనే ఒకింత హాట్ షో చేస్తారు. ఇది చాలా కామన్ కానీ కొందరు సినిమా వరకు రెచ్చిపోతే ఇంకొందరు ఆఫ్ లైన్ లో కూడా హాట్ షో చేస్తారు. ఇక వీటితో పాటుగా వారిలో బికినీ, స్విమ్ సూట్ అనేది కూడా చాలా సర్వ సాధారణమే..
దిశా పటాని అని మౌని రాయ్ ఇలా చాలా మంది బాలీవుడ్ హాట్ బ్యూటీస్ బికినీలో అదరగొట్టేస్తారు. అయితే వీరు ఇండియాలో కూడా ఈ షేడ్ లో కనిపిస్తారు కానీ సోనాక్షి సిన్హా మాత్రం పలు షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. తాను బయట దేశాల్లో మాత్రమే స్విమ్ సూట్ వేసుకునేందుకు ఇష్టపడతాను ఇండియాలో మాత్రం వేసుకోను అంటూ చెబుతుంది. దీనికి ఆమె చెబుతున్న షాకింగ్ రీజన్ పట్ల కూడ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆమె ఇండియాలో ఎందుకు స్విమ్ సూట్ వేసుకునేందుకు ఇష్టపడదు అంటే.. ఇక్కడ అయితే ఆమె ఆ సూట్ వేస్తే ఎవరు పడితే వారు ఎక్కడ నుంచి ఫోటోలు తీసి లీక్ చేస్తారో తెలీదు అందుకే ఇండియాలో మాత్రం బికినీ వేయను అని ఈ దబాంగ్ బ్యూటీ చెబుతుంది. వీటితో పాటుగా బొంబాయి లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా స్విమ్ చెయ్యను అని కేవలం ఎప్పుడైనా ట్రావెలింగ్ కి వెళ్ళినపుడు లేదా డైవ్ కి వెళ్ళినపుడు మాత్రమే వేస్తాను అంటూ తెలిపింది.
దీనితో కామెంట్స్ ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా వీటికి నెటిజన్స్ ఘాటుగానే రిప్లైలు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ కాదు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఈమె దహాడ్ అనే సిరీస్ లో కనిపించగా దీనితో పాటుగా బడే మియా చోటే మియా అనే సినిమాలో కూడా నటించింది. ఇక పెళ్లి తర్వాత ఈ సినిమాలు అన్నీ ఆమె తగ్గించేసింది.


Click it and Unblock the Notifications











