స్టార్ హీరోయిన్‌ బాత్రూమ్‌లో ఫ్యాన్‌..పెళ్లి చేసుకోకుంటే గొంతు కోసుకుంటా.. కత్తితో భయపెట్టి!

తండ్రి శత్రుఘ్నసిన్హా నట వారసురాలిగా బాలీవుడ్ కి పరిచయం చేసిన సోనాక్షి సిన్హా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అశేషమైన అభిమానులను సంపాదించుకున్న సోనాక్షి సిన్హా ఆ తర్వాతి కాలంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీతో కాస్త ఫెడవుట్ అయింది అని చెప్పక తప్పదు. ఈ మధ్యకాలంలో ఒక చీటింగ్ కేసులో వార్తల్లోకెక్కిన సోనాక్షి సిన్హా ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో వార్తల్లోకెక్కింది. ఒక షోలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను ఒక అభిమాని భయపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే గొంతుకోసుకుంటానని బెదిరించాడు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

స్టార్ హీరోయిన్ హోదా

స్టార్ హీరోయిన్ హోదా


శత్రుఘ్నసిన్హా నట వారసురాలిగా దబాంగ్ అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, బాస్, బుల్లెట్ రాజా వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే రజనీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో హీరోయిన్ గా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయం అయ్యింది.

ది ఖత్రా ఖత్రా' షో

ది ఖత్రా ఖత్రా' షో


ఆ తర్వాత పూర్తిగా దక్షిణాది సినిమాలకు దూరమైన ఆమె హిందీలోనే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఆమె కాస్త ఫెడవుట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె టీవీ షోలలో కూడా పాల్గొంటోంది. కలర్స్ టీవీ లో ప్రసారం అవుతున్న 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్‌ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించిన ఘటన చోటు చేసుకుంది.

పెళ్లి చేసుకోండి

పెళ్లి చేసుకోండి


షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్‌ రూమ్‌ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు, అప్పటికే షాక్ అయ్యి చూస్తున్న సోనాక్షి సిన్హాకు ఆమె పేరుతొ పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అనడం కనిపిస్తోంది.

పెళ్లి చేసుకోండి

పెళ్లి చేసుకోండి


ఆ తరువాత అద్దంపై లిపిస్ట్‌క్‌తో 'ఐ లవ్‌ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థం కాని సోనాక్షి అదేం వద్దు అని చేతితో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లోనై సదరు అభిమాని అక్కడ వస్తువులను విసిరేయడమే కాక తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్‌ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరించడంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడం కూడా వీడియోలో ఉంది.

సోనాక్షి సిన్హాకు తెలియ‌కుం

సోనాక్షి సిన్హాకు తెలియ‌కుం


ఈ వీడియోను కలర్స్ టీవీ తన సోషల్ మీడియా హ్యాడిల్ లో అప్ లోడ్ చేసింది. షోలో భాగంగా సోనాక్షి సిన్హాకు తెలియ‌కుండానే ఒక ప్రాంక్ చేశార‌ని అంటున్నారు. భార‌తీ సింగ్, హ‌ర్ష్ లింబాచియా హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఫ‌రా ఖాన్ స్పెష‌ల్ హోస్ట్‌గా క‌నిపిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X