దున్నపోతులా ఉన్నావు.. సోనాక్షి సిన్హాను దారుణంగా ట్రోలింగ్.. నెటిజన్లకు ఎలా షాకిచ్చిందటే!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా స్థూలకాయాన్ని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్ చేసిన అంశం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా దంబంగ్ చిత్రం ద్వారా సోనాక్షి హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే సమయంలో పుష్టిగా కనిపించడంతో ఆమెను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు వదిలారు. ఆ వ్యాఖ్యలను తాజాగా సోనాక్షి వెల్లడిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

దున్నపోతు అని సోనాక్షిపై కామెంట్
బాలీవుడ్ నిర్మాత, నటుడు, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్వహించే చాట్ షోకు సోనాక్షి సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు నెటిజన్లు చేసిన కామెంట్లను స్క్రీన్‌పై చూపించారు. అందులో ఆమెను ఉద్దేశించి దున్నపోతు అనే కామెంట్‌పై సోనాక్షి తీవ్రంగా స్పందించారు.

స్పెల్లింగ్ నేర్చుకోరా
నన్ను బఫెల్లో అంటూ కామెంట్ చేశారు. B-U-F-F-E-L-L-O అంటే ఫర్యాలేదు కానీ ముందు స్పెల్లింగ్ నేర్చుకో గురువా అంటూ సోనాక్షి సెటైర్ వేసింది. బరువు తగ్గడానికి నిరాహార దీక్ష చేయమని మరో నెటిజన్ కామెంట్ చేయగా సోనాక్షి తనదైన శైలిలో స్పందించారు.

నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి
నా బరువు తగ్గే విషయంపై పెద్దగా ఆలోచించకండి. నేను ఇంతకంటే గొప్ప రోల్స్ చేయలేను. మీకు తెలియని విషయం ఏమిటంటే.. నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను పనిచేయడానికి లెక్కలేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సోనాక్షి నెటిజన్లకు ఝలక్ ఇచ్చింది.

30 కిలోలు తగ్గాను
దంబంగ్ సినిమాలో నటించే సమయంలో నేను సుమారు 30 కిలోల బరువు తగ్గాను. ఆ సమయంలో నా ఆరోగ్యం బాగాలేదు. శరీరకంగా నేను కొన్ని సమస్యలతో బాధపడ్డాను. అయినా మీ సినిమా కోసం నేను 30 కిలోలు తగ్గాను. బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తర్వాత కూడా నన్ను దారుణంగా కామెంట్లు చేశారు అని సోనాక్షి వెల్లడించింది.


Click it and Unblock the Notifications











