మోస పోయిన హీరోయిన్ సోనాక్షి: అది ఓపెన్ చేయగానే షాక్!
ఆన్‌లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు లాంటివి ఆర్డర్ చేసి మోసపోయిన వారి గురించి గతంలో చాలా వార్తలు విన్నాం. తాజాగా హీరోయిన్ సోనాక్షి సిన్హాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ అమేజాన్ నుంచి ఖరీదైన హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేసిన ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సోనాక్షి బయట పెట్టారు.
అమేజన్ ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ సోనాక్షి సిన్హా తనకు జరిగిన మోసం గురించి వెల్లడించారు. నేను బోస్ హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అందులో ఇనుప ముక్క వచ్చింది అంటూ వాపోయారు. తన వద్దకు అది వచ్చినపుడు సూపర్‌గా ప్యాక్ చేసి ఉందని, కానీ అది ఓపెన్ చేస్తే అందులో ఈ చెత్త ఉందని తెలిపారు.
సోనాక్షి సిన్హా ట్వీట్
మీ కష్టమర్ సర్వీస్ కూడా తనకు ఏమాత్రం హెల్ప్ కాలేదని, మీ సర్వీస్ చాలా చెత్తగా ఉంది అంటూ సోనాక్షి అమేజన్ మీద ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వేలు ఖర్చు పెట్టి ఎవరైనా ఈ చెత్త కొంటారా?
రూ. 18,000 ఖర్చు పెట్టి సోనాక్షి దీన్ని ఆర్డర్ చేసిందట. అయితే అందులో అసలు వస్తువు లేకుండా ఇనుప ముక్క ఉండటంతో తాను మోస పోయినట్లు నిర్దారణకు వచ్చిన ఆమె వెంటనే ఫిర్యాదు చేసింది.

ఎలాంటి స్పందన లేదు
అయితే సోనాక్షి సిన్హాకు జరిగిన మోసంపై అమెజాన్ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదని తెలుస్తోంది. అయితే సోనాక్షి మాదిరిగా గతంలో ఇలా ఆన్‌లైన్లో ఆర్డర్ చేసి మోస పోయిన వారు ఆమెకు మద్దుతుగా సందేశాలు పోస్టు చేస్తున్నారు.

సినిమాలు
సోనాక్షి సిన్హా సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘కలంక్' అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే ‘మిషన్ మంగళ్' చిత్రంలో ముఖ్యమైన పాత్రకు ఎంపికైంది. దీంతో పాటు టోటల్ ఢామాల్ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











