Sonakshi Sinha : విడిపోక తప్పదు .. దగ్గరలోనే , విడాకులపై బాంబు పేల్చిన సోనాక్షి సిన్హా

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో స్టార్ కపుల్స్‌గా చెలామణి అవుతున్న వారు విడాకులపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీడియాలోనూ పలువురు దంపతులపై ఈ రూమర్స్ వస్తున్నాయి. కొందరు వీటిని ఖండిస్తుండగా మరికొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విడాకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లి జరిగి ఏడాది కాకుండానే సోనాక్షి నోటి వెంట ఇలాంటి మాటలు రావడంతో హిందీ పరిశ్రమ షాక్ అవుతోంది.

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా కుమార్తె, స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గతేదాడి జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2022లో డబుల్ ఎక్స్ అనే చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా అప్పట్లోనే బీ టౌన్ మీడియా కోడై కూసింది. అయితే ఈ సినిమా కంటే ముందు నుంచే వీరి మధ్య ప్రేమాయణం జరుగుతుందన్న సంగతి తెలిసి బాలీవుడ్ షాకైంది.

Sonakshi Sinha Zaheer Iqbal divorce rumours Heeramandi actress responds to trolling for separating from husband

పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. దీనిని ఇక్బాల్ తండ్రి ఖండించారు. సోనాక్షి హిందూ మతంలోనే ఉంటారని, మనమంతా మనుషులమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అటు ఈ పెళ్లి సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే శతృఘ్న సిన్హా మాత్రం పెళ్లికి హాజరై కూతురిని ఆశీర్వదించారు. వివాహం తర్వాత భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేశారు సోనాక్షి సిన్హా.

అయితే పెళ్లయిన కొద్దిరోజులకే సోనాక్షి సిన్హా గర్భం దాల్చినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని భార్యాభర్తలిద్దరూ ఖండించారు. ఇదే సమయంలో సోనాక్షి సిన్హా ముంబైలోని తన విలాసవంతమైన ఇంటిని విక్రయించినట్లుగా కథనాలు రావడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. బాంద్రాలో సీ ఫేసింగ్‌తో ఉన్న ఈ ఫ్లాట్‌ దాదాపు 4,200 చదరపు అడుగుల విస్తర్ణంతో నిర్మించారు. సోనాక్షి- జహీర్‌ల పెళ్లి కూడా ఈ ఫ్లాట్‌లోనే జరిగింది. తన జీవితంలోని కీలక ఘట్టాలకు వేదికైన ఈ ఫ్లాట్‌ను సోనాక్షి ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరని పలువురు ఖండించారు.

ఇకపోతే.. గడిచిన కొద్దిరోజుల నుంచి సోనాక్షి సిన్హా - ఇక్బాల్‌ల వ్యక్తిగత జీవితం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సోనాక్షి ఏం మాట్లాడినా? ఏం చేసినా .. మీరు ఎప్పుడు విడిపోతున్నారు? అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. తొలుత వీటిని పట్టించుకోని ఈ స్టార్ హీరోయిన్.. ఈసారి మాత్రం స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు.

ఓ వ్యక్తి మీరు విడాకులకు దగ్గరగా ఉన్నారంటూ హద్దు మీరి కామెంట్ చేయడంతో సోనాక్షి ఫైర్ అయ్యారు. మేం విడాకులు ఖచ్చితంగా తీసుకుంటాం.. అయితే ముందు మీ అమ్మానాన్నలు తీసుకోవాలి అంటూ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తాలుకా స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X