టాలీవుడ్ తెరకు మరో ముద్దుగుమ్మ.. ఊర్వశి ఓటీటీలో కళ మూవీ రిలీజ్
లాక్‌డౌన్‌లో థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకుల వినోదానికి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు కేరాఫ్ అడ్డగా మారాయి. పాపులర్ ఓటీటీ సంస్థలతోపాటు స్థానిక పలు ఓటీటీలు ప్రేక్షకులకు చేరవయ్యాయి. ఈ కోవలో తెలుగులో ఊర్వశీ పేరుతో ఓటీటీ సంస్థ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం విభిన్న కథాశంతో రూపొందిన కళ అనే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఈ సంస్థ సన్నాహాలు చేస్తున్నది.
నాగేంద్రవర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి గణేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగేంద్రవర్మ బిరుదురాజు నిర్మించిన పీరియాడిక్ ఫిల్మ్ కళ. "ది ఉమెన్" అన్నది ట్యాగ్ లైన్. సోనాక్షివర్మ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో భరత్ రాజ్, సుజన్ రాజ్, గణేష్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 50 ఏళ్ళ క్రితం సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతూ ఈ చిత్రం రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'ఊర్వశి ఓటిటి' ద్వారా త్వరలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఓ అమ్మాయి జీవితంలో రేగిన కలకలం ఏమిటన్నది అందరి హృదయాలకు హత్తుకునేలా చూపించే చిత్రం కళ. డ్రామాతోపాటు సస్పెన్స్ మేళవించి రూపొందిన కళ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అభినయం, ఛాయాగ్రహణం, సంగీతం, సంభాషణలు.. 'కళ' చిత్రానికి ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయి. మా చిత్రం "ఊర్వశి" ఓటిటి" ద్వారా విడుదలవుతుండడం ఆనందంగా ఉంది" అన్నారు.

సంగీతం: గిడియన్,
ఛాయాగ్రహణం: నాగిరెడ్డి,
సంభాషణలు: రమేష్ రాయ్,
నిర్మాత: నాగేంద్రవర్మ బిరుదురాజు,
కాన్సెప్ట్-కూర్పు-దర్శకత్వం: ఫణి గణేష్
పిఆర్వో: ధీరజ అప్పాజీ,
విడుదల: ఊర్వశి ఓటిటి


Click it and Unblock the Notifications











