For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  |

  సినీ రంగానికి, క్రికెట్‌కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు, సినిమా స్టార్లతో ప్రేమాయణాలు సాగించారు. అందులో చాలా మంది తమ తమ బంధాలను పెళ్లిళ్ల వరకూ తీసుకెళ్లగా.. మరికొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్‌లు చెప్పుకున్నారు. ఇక, ఇంకొందరు మాత్రం ఇప్పటికీ లవ్ ట్రాకులు నడుపుతూనే ఉన్నారు.

  ఇలా సినీ స్టార్లతో లవ్వాటలు ఆడే వాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు బయటకు వచ్చాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి నైట్ పార్టీలో కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడమే. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అందంతో మాయ చేసిన సోనాల్

  అందంతో మాయ చేసిన సోనాల్

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో చూపు తిప్పుకోకుండా చేయగల సోనాల్ చౌహాన్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన ఒంపుసొంపులతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును అందుకుంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ పని చేసింది.

  అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన మార్కును చూపించింది. అంతేకాదు, ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకుంది. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిందీ భామ.

  Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ

  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరపించిన సోనాల్ చౌహాన్‌కు చాలా ఇండస్ట్రీల నుంచి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా యాక్టింగ్ వైపు వెళ్లలేదు. ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని అందుకున్న చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అడుగులు వేసింది.

  మొదటి చిత్రంలోనే మంచి పాత్రను పోషించిన సోనాల్ చౌహాన్.. గ్లామర్ పరంగానూ బాగా మెప్పించింది. దీంతో మొదటి చిత్రంతలోనే పాపులర్ అయింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా సెలెక్టివ్‌గానే చేస్తూ వస్తోంది.

  తెలుగులోకి ఎంట్రీ.. ఆ భాషల్లోనూ

  తెలుగులోకి ఎంట్రీ.. ఆ భాషల్లోనూ

  'జన్నత్' తర్వాత సోనాల్ చౌహాన్‌కు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో మిగిలిన భాషలను కాదని.. 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది.

  ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. ఆయా భాషల్లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఫలితంగా సోనాల్ చౌహాన్ ఎక్కువగా ఆ భాషల్లోనే చేస్తోంది.

  Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ తెలుగు సీజన్.. కొత్త డేట్ ఇదే

   బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు

  బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు

  సుదీర్ఘమైన కెరీర్‌లో సోనాల్ చౌహాన్ తెలుగులో మొత్తం ఏడు సినిమాలు చేసింది. 'రెయిన్‌బో' నుంచి మొదలుకొని 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో ఆడిపాడింది. అందులో మూడు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణతో చేసినవే ఉన్నాయి. ఈ సినిమాలన్నింటిలోనూ ఆమె అందాల ఆరబోసింది. తద్వారా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గానే గుర్తింపును తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు 'F3' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందామె.

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగానే

  అందులో ఎప్పుడూ ఫుల్ బిజీగానే

  చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. అవకాశాలు లేక ఖాళీగా గడుపుతున్నా.. హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

  అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. అలాగే, హాట్ షోతోనూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా సోనాల్ చౌహాన్ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

  సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!

  ఆ క్రికెటర్‌కు సలహా ఇవ్వడంతో

  ఆ క్రికెటర్‌కు సలహా ఇవ్వడంతో

  మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సోనాల్ చౌహాన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. అలాగే, అప్పుడప్పుడూ సెలెబ్రిటీలతో సరదా సంభాషణలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. తన సోదరితో కలిసి లాక్‌డౌన్ సమయంలో చిన్న మ్యాజిక్ ట్రిక్ చేసిన వీడియోను షేర్ చేశాడు. అంతేకాదు, తనకు బోర్ కొడుతుందని పోస్ట్ చేశాడు. దీనికి 'లాక్‌డౌన్‌లో మరిన్ని మ్యాజిక్‌లు నేర్చుకో' అని సోనాల్ కామెంట్ చేసి హాట్ టాపిక్ అయింది.

  క్రికెటర్‌తో సోనాల్ నైట్ పార్టీలో

  క్రికెటర్‌తో సోనాల్ నైట్ పార్టీలో

  శ్రేయాస్ అయ్యర్‌తో సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో సంభాషణ జరిపిన సమయంలో వీళ్లిద్దరి మధ్య ఏదైనా ట్రాక్ నడుస్తుందా అని అందరూ చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా వీళ్లిద్దరూ కలిసి ఓ నైట్ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోనాల్ సోదరి హిమానీ చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, 'ఇద్దరూ సక్సెస్ అవ్వాలి' అంటూ కామెంట్ చేసింది. దీంతో సోనాల్, అయ్యర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న అనుమానాలకు బలం చేకూరినట్లైంది. ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది.

  English summary
  Tollywood Actress and a former model Sonal Chauhan Recently Participated in a Party with Cricketer Shreyas Iyer. These Pics Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X