బీచ్ ఒడ్డున బాలయ్య భామ బికినీ ట్రీట్.. ఒంపు సొంపులతో కైపెక్కిస్తోందిగా!
సోషల్ మీడియా సినీ సెలబ్రిటీలకు వారి అభిమానులకు వారధిగా మారుతోంది.. సినిమాల్లో అందాల ఆరబోత ఉంటుందో లేదో చెప్పడం కష్టమే కానీ హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలు ఫాలో అయితే అద్భుతమైన ఫోటోలు వీక్షించే అవకాశం దక్కించుకోవడం ఖాయమని చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. తమ అందచందాలను అందులో ఆరబోస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఒకరు. తెలుగులోనూ పలు చిత్రాలతో సందడి చేసిన ఈ భామ అవకాశాలు కాస్త తగ్గడంతో సోషల్ మీడియాలో అందాలతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ ఒక హాట్ బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫోటో మీద మీరూ ఓ లుక్కేయండి మరి!

అందాల పోటీలలో
ఆగ్రాలో ఒక సంప్రదాయ రాజ్ పూత్ కుటుంబంలో పుట్టి పెరిగిన సోనాల్ నోయిడాలో తన స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీలో ఆమె కాలేజ్ చదువు పూర్తి చేసింది. అయితే ముందు నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న సోనాల్ చౌహాన్ చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించి డబ్బు బాగానే వెనకేసుకుంది. అదే సమయంలో ఆమె పలు అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం పోటీలో పాల్గొని ఆ కిరీటాన్ని అందుకుని మరింత ఫేమస్ అయింది సోనాల్.

వరుస అవకాశాలు
మోడలింగ్ రంగంలో అలరించిన సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో సినిమాల మీద దృష్టి పెట్టకుండా గ్యాప్ తీసుకుని 'జన్నత్' అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్రను పోషించిన సోనాల్ గ్లామర్ పరంగానూ మంచి మార్కులు వేయించుకుంది.

అన్ని భాషల్లో
'జన్నత్' తర్వాత సోనాల్ చౌహాన్‌కు అన్ని భాషల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. అన్నిటికంటే టాలీవుడ్ బెటర్ అనుకుందో ఏమో కానీ 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా కలసి రాలేదు. టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకున్న ఆమె ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

తెలుగులో కూడా
అయితే అదే సమయంలో తెలుగులో కూడా అవకాశాలు రావడంతో పలు సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' మొదలు 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె 'F3' సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసిందని అంటున్నారు. అయితే ఆమెకి ఈ మధ్య సినిమా ఆఫర్స్ తగ్గాయో ఏమో తెలీదు కానీ సోషల్ మీడియా ద్వారా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది.

హాట్ బికినీ
తన ఫొటోలు, వీడియోలు అంటే మామూలుగా ఉంటాయి అని అనుకునేరు. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగిన పిక్సే ఉంటాయి. అందులోనూ బికినీ ధరించిన ఫొటోలు కూడా మరీ ఎక్కవగా సోనాల్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఆరెంజ్ కలర్ బికినీ వేసుకుని ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











