Adipurush: 2 నిమిషాలకే 50 లక్షలు.. బాలయ్య హీరోయిన్ పెను సంచలనం
సినీ రంగంలో హీరోయిన్లుగా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. అందుకు అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ చివరిది లేకనే చాలా మంది అంతగా సక్సెస్ కావడం లేదు. అందులో సోనాల్ చౌహాన్ ఒకరు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. పెద్దగా అవకాశాలను మాత్రం దక్కించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే వచ్చిన 'ఆదిపురుష్' మూవీలో కీలక పాత్రను చేసింది. ఇందుకోసం ఆమె షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందని తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!
బాలయ్య హీరోయిన్ అని : టాలీవుడ్‌లో సోనాల్ చౌహాన్‌కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వరుసగా 'రెయిన్‌బో', 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3', 'ది ఘోస్ట్' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది. ఫలితంగా ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.

ఆదిపురుష్‌లో మండోదరి : అందానికి అందం, నటనకు నటన పరంగా సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు అంతగా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ భామ ప్రభాస్ హీరోగా చేసిన 'ఆదిపురుష్'లో కీలకమైన మండోదరి (రావణాసురుడి భార్య) పాత్ర చేసింది. దీంతో ఈమె రోల్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ పాత్రను సోనాల్ ఎలా చేసిందో చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారు.

నిరాశనే మిగిల్చిన పాత్ర : 'ఆదిపురుష్' రిలీజ్ అయ్యాక సోనాల్ చౌహాన్ పాత్ర విషయంలో అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఆమె ఇందులో కేవలం రెండంటే రెండు సీన్లకే పరిమితం అవడమే. అంతేకాదు, ఆమె నోటి నుంచి కూడా రెండు డైలాగులు మాత్రమే వచ్చాయి. దీంతో మండోదరి పాత్ర పరిధిని తగ్గించడంపై డైరెక్టర్ ఓం రౌత్‌ను సోనాల్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు.

రెమ్యూనరేషన్ భారీగానే : సోనాల్ చౌహాన్ 'ఆదిపురుష్' సినిమాలో కేవలం రెండు సీన్లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ.. రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్ర నిర్మాతల నుంచి సోనాల్ ఏకంగా రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందట. దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ పెద్దలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయమే.. కట్ చేశారు : కేవలం రెండు సన్నివేశాల్లో కనిపించినా సోనాల్ చౌహాన్ రూ. 50 లక్షలు చార్జ్ చేయడంపై విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దీనిపై మరింత సమాచారం లీకైంది. దీని ప్రకారం.. ఆమె ఈ చిత్రం కోసం చాలా రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొందట. కానీ, సినిమా నిడివి ఎక్కువ అవడం వల్ల సోనాల్ సీన్స్‌ను కట్ చేశారట. అందుకే ఆమె రోల్ తగ్గిందని సమాచారం.


Click it and Unblock the Notifications











