Sonal Chauhan రెచ్చిపోయి అందాలు ఆరబోత .. బికినీలో 'లెజెండ్' బ్యూటీ ఘాటు ఫోజులు!

సోనాల్ చౌహాన్ తెలుగులో బాలయ్య సరసన 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్', 'పండగ చేస్కో' లాంటి సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టు, అయినా ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఎవరి కంటా పడక పోతామా అన్నట్టు, హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫోటో షూట్ ఈ చలికాలంలో కూడా సెగలు పుట్టిస్తోంది.

మిస్ ఇండియా వరల్డ్

మిస్ ఇండియా వరల్డ్

34 ఏళ్ల సోనాల్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలోని రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె నోయిడాలోని DPS స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. 2005 సంవత్సరంలో, ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత జన్నత్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీని తర్వాత సోనాల్ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. అయితే సోనాల్ చౌహాన్ బాలీవుడ్ చిత్రాలలో విజయం సాధించలేకపోయింది.

 డేటింగ్

డేటింగ్

నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో సోనాల్ కు అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. మలైకా నుండి విడాకుల తర్వాత, అర్బాజ్ ఖాన్ సోనాల్ చౌహాన్‌తో చాలాసార్లు కనిపించాడు. ఇది కాకుండా, భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దాసానితో ఆమె ఎఫైర్ గురించి వార్తలు వచ్చాయి. ఇది కాకుండా, సోనాల్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ మరియు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కూడా డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.

అవకాశాల కోసం

అవకాశాల కోసం

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సరసన జన్నత్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ఆమె తెలుగులో పండగ చేస్కో, షేర్ లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. బాలయ్య సరసన ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామకి కాలం మాత్రం కలిసి రావడం లేదు. మళ్ళీ బాలయ్యతో అఖండ అనే సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఆమె నటించనని తేల్చి చెప్పి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది.

ఫోటోషూట్ లతో రచ్చ

ఫోటోషూట్ లతో రచ్చ

బాలీవుడ్ లో కూడా ఆమె అడపాదడపా సినిమాల్లో నటించినా ఈ భామకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అయితే ఇన్ స్టా వేదికగా ఫాలోయింగ్ పెంచుకునేందుకు సోనాల్ వరుసగా హాట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. సోనాల్ బ్లాక్ బికినీలో తన ఫోటోలను షేర్ చేసింది, అందులో ఆమె గ్లామరస్ గా కనిపిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా సోనాల్ తన ఫోటోను పోస్ట్ చేసి, 'కొత్త ఆరంభాల మాయా అనుభూతిని ఆలింగనం చేసుకుంటోంది' అని రాసుకొచ్చింది.

మాములుగా లేదుగా

మాములుగా లేదుగా

ఇక మరో ఫోటోలో, ఆమె ఈ బికినీతో సాధారణ తెల్ల చొక్కా ధరించింది. సోనాల్ యొక్క ఈ బోల్డ్ స్టైల్‌ని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చివరిగా సోనాల్ మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ది పవర్ లో చాందిని అనే కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ - శృతిహాసన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఎఫ్ 3 సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X