ఎద అందాలు ఆరబోస్తూ లెజెండ్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. ఫ్యాన్స్ దెబ్బకు మూసేసిందిగా!
సోషల్ మీడియాలో హల్చల్ చేసే భామల పేరు తీస్తే అందులో ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. సినిమాల్లోకి చాలా కాలం క్రితం వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుసగా ఆఫర్లను అందుకుంటూ వెళ్తోంది కానీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోతోంది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా హిట్ కోసం పరితపిస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!

అందాల పోటీల్లో
ఆగ్రాలో ఒక సంప్రదాయ రాజ్ పుత్ కుటుంబంలో పుట్టి పెరిగిన సోనాల్ నోయిడాలో తన స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాలేజ్ చదువు పూర్తి చేసి, చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించి డబ్బు బాగానే వెనకేసుకుని పలు అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం పోటీలో పాల్గొని ఆ కిరీటాన్ని అందుకుంది.

రెయిన్‌బో సినిమాతో
ఆ సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు బాలీవుడ్ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే బాలీవుడ్ సినిమా ద్వారా ఆమె హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ 'జన్నత్' మూవీలో నటించిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

'లెజెండ్'తో క్రేజ్
అయితే, ఈ సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియకపోవడంతో ఆమె ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ క్రేజ్ పెంచుకుంది. అలా ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే తెలుగు నుంచి కూడా వకాశాలు రావడంతో వచ్చిన అన్నిటినీ వాడుకుంటూ వెళ్తోంది. అలా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాల్లో నటించింది.
హాట్ ఫొటోలను
తాజాగా ఆమె 'F3' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది అని చెప్పవచ్చు. అయితే ఆమె సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన అభిమానులను హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతూనే ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సోనాల్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
ఎద అందాలు ఆరబోస్తూ
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి.. ఎద అందాలు ఆరబోస్తూనే ఆమె ప్రేమ పాఠాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజమైన ప్రేమ లేని చోట దొరకదు....అలాగని దాన్ని ఎక్కడ కాదనలేరు. అంటూ అర్ధం అయ్యీ కాకుండా కామెంట్స్ చేసిన ఆమె ఎందుకొచ్చిన టెన్షన్ అనుకుందో ఏమో? కామెంట్స్ బాక్స్ మాత్రం మూసేసింది.


Click it and Unblock the Notifications











