నేను బతకడం కష్టమని చెప్పారు.. పిచ్చిపట్టినట్లైయింది.. భర్తతో గొడవపడ్డాను.. సొనాలి

అందాల తార సొనాలిబింద్రే హై గ్రేడ్ క్యాన్సర్ వ్యాధికి గురికావడం సినీలోకాన్ని ఆందోళనకు గురిచేసింది. క్యాన్సర్ వ్యాధి కోసం అమెరికాకు వెళ్లిన సొనాలి పూర్తి ఆరోగ్యంతో ఇటీవల తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. తన‌కు క్యాన్సర్ వచ్చిన సమయంలో జరిగిన భావోద్వేగ సంఘటనలు, వైద్యులు చెప్పిన మాటలను ఇటీవల మీడియాకు వివరించింది. ఆమె ఏం చెప్పారంటే..

క్యాన్సర్ గురించి చెప్పలేదని

క్యాన్సర్ గురించి చెప్పలేదని

క్యాన్సర్ వ్యాధి సోకినట్టు ముందుగా నా భర్త నాకు చెప్పలేదు. అమెరికాకు చికిత్స కోసం వెళ్లాలంటే నేను అంగీకరించలేదు. ఇక్కడ వైద్యులు ఉండగా, యూఎస్‌కు ఎందుకని పోట్లాడాను. కానీ పట్టుబట్టి నన్ను బలవంతంగా విమానం ఎక్కించారు. విమానంలో కూడా నేను ఆయనతో గొడవపడ్డాను.

రాత్రి, పగలు తేడా లేకుండా చికిత్స

రాత్రి, పగలు తేడా లేకుండా చికిత్స

అమెరికాలో వైద్యులు నాతో పెద్దగా మాట్లాడానికి ఇష్టపడలేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పరీక్షలు, చికిత్స చేస్తున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఓ దశలో నాకు పిచ్చిపట్టినట్టు అనిపించింది.

నేను బతకడం కష్టమన్నారు

నేను బతకడం కష్టమన్నారు

అమెరికాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాలుగో స్టేజ్‌లో క్యాన్సర్ ఉంది. బతకడం చాలా కష్టమని చెప్పారు. జీవించడానికి 30 శాతం మాత్రమే అవకాశం ఉందని చెప్పడంతో నా ఆశలు ఆవిరైపోయాయి. అప్పుడు నన్ను బతికించుకోవడానికి నా భర్త చేసిన ప్రయత్నాలు నాకు పూర్తిగా అర్ధమయ్యాయి. అమెరికాకు తీసుకువచ్చినందుకు నా భర్తకు, దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొన్నాను.

మనోధైర్యంతో క్యాన్సర్‌ను ఎదురించాను

మనోధైర్యంతో క్యాన్సర్‌ను ఎదురించాను

నా స్నేహితులు, సన్నిహితులు నా పట్ల సానుభూతి చూపించడం నాకు నచ్చలేదు. మానసిక సంఘర్షణకు లోనయ్యాను. అమెరికాలో సైక్రియాటిస్ట్ వద్దకు వెళ్లాను. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండే నేను ఒక్కసారిగా నా ప్రవర్తన మారిపోయింది. కానీ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి నేను మనోధైర్యాన్ని కూడగట్టుకొన్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X