మాజీ సీఎం తమ్ముడితో టాలీవుడ్ హీరోయిన్ అఫైర్?.. ఆ వీడియో లీక్.. నటి రియాక్షన్ ఇదే

భారతదేశంలో సినీనటులు - రాజకీయ నాయకుల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నాయకులతో పలువురు స్టార్స్ అఫైర్స్, ప్రేమలు, పెళ్లిళ్లు కొత్త కాదు. ఎప్పటి నుంచో ఇది జరుగుతున్న వ్యవహారమే. ఎవరైనా నాయకుడితో నటి కొంచెం క్లోజ్‌గా ఉంటే చాలు వారి గురించి మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా బాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటికి, మాజీ సీఎం తమ్ముడికి మధ్య ఏదో జరుగుతుందన్న వ్యవహారం చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మురారీతో టాలీవుడ్‌లోకి
టాలీవుడ్, బాలీవుడ్‌లలో హిట్ చిత్రాల్లో నటించారు సోనాలి బింద్రే. సినిమాలతో పాటు పలు వివాదాలు కూడా ఈమె కెరీర్‌లో ఉన్నాయి. అప్పట్లో రాజస్థాన్‌లో జరిగిన షూటింగ్‌లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకలు వేటాడిన ఘటనలో స్పాట్‌లో సోనాలి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. పలువురు స్టార్స్‌తోనూ ఈమెకు ఎఫైర్స్ ఉన్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. తెలుగులో మురారీ, ఇంద్ర, పలనాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ తదితర చిత్రాల్లో నటించిన సోనాలి ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమయ్యారు.

Sonali Bendre - Raj Thackeray Relationship Murari Actress breaks silence on link up rumours

క్యాన్సర్‌ను జయించిన సోనాలి
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గోల్డీ బెల్ అనే సినీ నిర్మాతను సోనాలి బింద్రే పెళ్లాడారు. ఈ దంపతులకు రణవీర్ బెల్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్ల పాటు నటనకు దూరంగానే ఉన్నారు సోనాలి బింద్రే. ఇదే సమయంలో క్యాన్సర్ బారినపడటంతో ఆమె బాగా కృంగిపోయారు. అయినప్పటికీ మొక్కవోనీ దీక్షతో క్యాన్సర్ మహమ్మారిని జయించారు. అనంతరం దేశంలో క్యాన్సర్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్యాన్సర్ రోగులకు సాయం చేస్తున్నారు సోనాలి. తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలు చేస్తూ నటిగానూ బిజీ అయ్యారు. ఈ ఏడాది బీ హ్యాపీ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.

రాజ్ థాక్రే‌తో కనిపించిన సోనాలి
ఇదిలాఉండగా.. సోనాలి బింద్రే- మహారాష్ట్ర నవ నిర్మాణ సంస్థ అధినేత రాజ్ థాక్రే కలిసి ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌కు చాలా సన్నిహితంగా నవ్వుతూ పాల్గొన్న సోనాలిపై మీడియా కెమెరాలు ఫోకస్ చేశాయి. అంతకుముందు 1996లో దివంగత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ భారతదేశానికి వచ్చినప్పుడు ముంబై ఎయిర్‌పోర్టులో ఆయనను స్వయంగా ఆహ్వానించిన వారిలో రాజ్ థాక్రే, సోనాలి కూడా ఉన్నారు. అప్పుడే వీరి బంధం గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అలాంటిది దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ సోనాలి - రాజ్‌లు సన్నిహితంగా కనిపించడంతో సోషల్ మీడియాలో వీరి మధ్య అఫైర్ నడుస్తోందని కథనాలు వస్తున్నాయి.

చిన్నప్పటి నుంచే ఫ్రెండ్‌షిప్
దీనిపై ఓ ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే స్పందించారు. అసలు ఇలాంటి ప్రచారాలు జరిగిన విషయమే తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అయినా ఇది బాధాకరం.. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని సోనాలి తెలిపారు. రాజ్ సతీమణి షర్మిల.. ఆమె తల్లికి మా పిన్ని బెస్ట్ ఫ్రెండ్.. అలా మా కుటుంబాల మధ్య చిన్నతనం నుంచే స్నేహం ఉందని.. అది ఇప్పటికీ కొనసాగుతోందని సోనాలి బింద్రే స్పష్టం చేశారు. అలాగే రాజకీయాల్లోకి రావాలని కూడా తనకు లేదని ఇదే ఇంటర్వ్యూలో ఆమె తేల్చిచెప్పారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రశంసలు, విమర్శలు రెండింటిని స్వీకరించాలని అంత ధైర్యం తనకు లేదని సోనాలి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: sonali bendre raj thackeray
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X