twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాన్సర్‌తో పోరాటం.. 18 ఏళ్ల తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్ హీరోయిన్.. RRR హీరోతో..

    |

    ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరోయిన్స్ లలో సోనాలి బింద్రే ఒకరు. తెలుగులో ఆమె చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక విధంగా హైలెట్ అవుతూ ఉండేది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు అందుకున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో సోనాలి ఒకరు. పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయిన ఈ బ్యూటీ కొన్నాళ్ల తర్వాత హఠాత్తుగా మాయమైంది.

    అలాగే క్యాన్సర్ బారిన పడడంతో విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇక మళ్ళీ క్యాన్సర్ ను జయించిన సోనాలి హిందీలో రియాలిటీ షోలతో బిజీగా కనిపిస్తూనే ఉండేది. త్వరలోనే ఆమె తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    17 ఏళ్ల వయసులోనే..

    17 ఏళ్ల వయసులోనే..

    మొదట 17 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ ప్రపంచంలోకి దూసుకువెళ్లిన సోనాలి బింద్రే ఆ తరువాత రెండేళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదట ఆమె హిందీలో ఆగ్ సినిమా ద్వారా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి సినిమాతోనే ఆమె ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం. ఆ తర్వాత రెండు మూడేళ్లలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సోనాలి బింద్రే చాలా బిజీగా మారిపోయింది.

    తెలివైన హీరోయిన్

    తెలివైన హీరోయిన్

    హిందీ తమిళ్ తెలుగు అని తేడా లేకుండా అన్ని రకాల ఇండస్ట్రీలలో ఆమె సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోనాలి బింద్రే సక్సెస్ రేటు కూడా అప్పట్లో చాలా పవర్ఫుల్ గా ఉండేది. ఆమె కథలను కూడా చాలా జాగ్రత్త గా సెలెక్ట్ చేసుకునేది అని మంచి టాక్ కూడా వచ్చేది. సోనాలి బింద్రే నటిస్తే తప్పకుండా సినిమా లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని మంచి విజయాన్ని కూడా అందుకుంటాయని అని అందరిలో ఒక నమ్మకం కూడా ఏర్పడింది.

    మొదట ఆ సినిమాతో

    మొదట ఆ సినిమాతో

    టాలీవుడ్ లో సోనాలి బింద్రే చేసిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. మహేష్ బాబు కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తర్వాత ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ సినిమాలను కూడా చేసుకుంటూ వచ్చింది.

     2002 బిగ్ హిట్స్

    2002 బిగ్ హిట్స్

    ఇక ఆ తర్వాత ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. అనంతరం వెంటనే మన్మధుడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో 2002లో ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అంతేకాకుండా అప్పట్లో సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్స్ లలో సోనాలి బింద్రే టాప్ లో నిలవడం విశేషం.

    చివరి తెలుగు సినిమా

    చివరి తెలుగు సినిమా

    ఇక 2004లో శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే సినిమాతో మరొక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సోనాలి బింద్రే ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. హిందీ మరాఠీ లో ఒక సినిమా చేసి ఆ తరువాత మిగతా ఇండస్ట్రీలో కూడా ఆమె పెద్దగా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. హటాత్తుగా సోనాలి బింద్రే ఎక్కడికి వెళ్ళిపోయింది అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

    పెళ్లి అనంతరం..

    పెళ్లి అనంతరం..

    2002 లో సోనాలి బింద్రే ఫిలిం మేకర్ గోల్డెయి బెహల్ ను వివాహమాడి ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో చాలా బిజీగా మారిపోయింది. ఇక 2004 తర్వాత ఆమె పలువురు రియాలిటీ షోలలో జడ్జి గా వ్యవహరించింది. ఇక 2013లో 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబరా' అనే సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపించే ప్రేక్షకులకు కిక్ అయితే ఇచ్చింది. ఇక ఆమె ఆ తరువాత కూడా పలు సింగింగ్ డాన్స్ షోలకు జడ్జి గానే కొనసాగుతూ వచ్చింది.

    క్యాన్సర్ ను జయించిన సోనాలి

    క్యాన్సర్ ను జయించిన సోనాలి

    ఇక 2018 సోనాలి బింద్రే క్యాన్సర్ ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే అంటూ ఆమె సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ గానే స్పందించింది. ఆ తర్వాత న్యూయార్క్ సిటీ వెళ్ళిపోయినా సోనాలి బింద్రే కొన్ని రోజుల వరకు అక్కడే మెరుగైన చికిత్స తీసుకుంది. మధ్యమధ్యలో సోనాలి బింద్రే కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ఆమె జుట్టు లేకుండా కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆమె అందరూ కోరుకున్నట్లే మళ్ళీ తొందరగానే కొలుకుంది.

     ఎన్టీఆర్ సినిమాతో రీ ఎంట్రీ

    ఎన్టీఆర్ సినిమాతో రీ ఎంట్రీ

    అయితే సోనాలి బింద్రే మళ్లీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా తర్వాత మళ్ళీ కనిపించని సోనాలి బింద్రేకు టాలీవుడ్ లో మధ్యలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో చేయలేకపోయింది. ఇక ఫైనల్ గా ఆమె ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోయే సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించినట్లు సమాచారం. మరి దాదాపు 18 ఏళ్ల అనంతరం రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి బింద్రే ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Sonali Bendre tollywood re entry after 18 years with jr ntr movie..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X