లిప్‌లాక్స్ అంటూ లొల్లి.. ఆ వేధింపులు తట్టుకోలేక రిజెక్ట్ చేశా.. బాబు బంగారం హీరోయిన్ ఘాటైన కామెంట్స్

బాబు బంగారం, ఆటాడుకుందాం రా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనమ్ బజ్వా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణించిన ఈ అందాల భామ ప్రస్తుతం పంజాబీ సినిమాకే పరిమితమైంది. అయితే వేధింపులు భరించలేక హిందీలో వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేశానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సోనమ్ బజ్వా చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

సోనమ్ బజ్వా తొలుత పంజాబీ సినిమాలతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కప్పాల్ అనే సినిమాతో తమిళంలో నటించింది. బాబు బంగారం సినిమాలో దండమే పెట్టుకొంటాం అనే స్పెషల్ సాంగ్‌తో తెలుగులో అడుగుపెట్టింది. అనంతరం ఆటాడుకుందాం రా అనే సినిమాలో నటించింది. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పంజాబీలో బిజీ కావడంతో దక్షిణాదికి దూరమైంది.

Sonam Bajwa Shocking comments on Liplock scenes in Bollywood

సోనమ్ బజ్వా తాజా ఇంటర్వ్యూలో.. బాలీవుడ్‌లో రకరకాల వేధింపులు, కండిషన్లు ఉంటాయి. అలాంటి వాటిని తట్టుకోలేక హిందీ సినిమా ఆఫర్లు వదులుకొన్నాను. బాలా, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ సినిమాల తర్వాత నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. పెద్ద హీరోల పక్కన స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని షరతులు భరించలేక వాటిని వదులుకొన్నాను అని సోనమ్ బజ్వా చెప్పారు.

బాలీవుడ్‌లో నిర్మాతలు, దర్శకుల గొంతెమ్మ కోరికలు ఎక్కువ. కొన్నిసార్లు ముద్దు సీన్లు, లిప్‌లాక్ డిమాండ్లు ఒప్పుకోలేకపోయాను. ముద్దుల లొల్లిని నేను భరించలేకపోయాను. కొన్ని ఇంటిమేట్ సీన్ల చేయాల్సి రావడంతో నేను భయపడ్డాను. పంజాబీలో నాకు ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ పాడు చేసుకోలేక హిందీ అవకాశాలు వదులుకొన్నాను అని సోనమ్ బజ్వా చెప్పింది.

Sonam Bajwa Shocking comments on Liplock scenes in Bollywood

షారుక్ ఖాన్‌తో ఓం శాంతి ఓం సినిమా కోసం దర్శకురాలు ఫర్హా ఖాన్ నన్ను ఆడిషన్ చేసింది. అంతా ఒకే అనుకొన్న సమయంలో నా స్థానంలో దీపిక పదుకోన్‌ను తీసుకొన్నారు. ఆ ఆఫర్ రాకపోవడంతో 2013లో నేను బెస్టాఫ్ లక్ అనే పంజాబీ సినిమాలో నటించాను. ఆ సినిమా నా కెరీర్ గ్రాఫ్‌ను మార్చేసింది అని చెప్పింది.

పంజాబీ భాషలో సోనమ్ బజ్వాకు మంచి డిమాండ్ ఉంది. ఆ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకొంటున్న హీరోయిన్‌గా ఘనతను సాధించింది. ఆమె నటించిన గాడ్ డే గాడ్ డే సినిమా ఇటీవల రిలీజై భారీ వసూళ్లను సాధించింది. మే 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 5 కోట్ల కలెక్షన్లు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X