హీరోయిన్ ఇంట భారీ చోరీ.. ఎంత కొట్టేశారో తెలుసా? తలలు పట్టుకుంటున్న పోలీసులు

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మరో మారు వార్తల్లోకి ఎక్కారు. నిజానికి ఆమె కొద్ది రోజుల క్రితం తాను గర్భవతిని అని ప్రకటించారు. ఇక తాజాగా ఆమె ఇంట చోరీ జరిగినట్లు సమాచారం. ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏకంగా కోటిన్నర రూపాయల సొత్తు చోరీ అయినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

1.41 కోట్ల విలువైన నగలు

1.41 కోట్ల విలువైన నగలు

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లోకి దొంగలు పడ్డారు. సోనమ్ ఇంట్లో నుంచి రూ.1.41 కోట్ల విలువైన నగలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు సోనమ్ కపూర్ అత్తగారు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిజానికి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగినా అప్పటి నుంచి పెద్దగా ఏమీ తేల్చక పోవడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని పలు బృందాలను ఏర్పాటు చేశారు.

ఆనంద్ తల్లి ప్రియా ఆహూజా ఫిర్యాదు

ఆనంద్ తల్లి ప్రియా ఆహూజా ఫిర్యాదు


సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా కుటుంబానికి దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ బంగ్లా ఒకటి ఉన్నది. ఆ ఇంట్లోనే ఇప్పుడు చోరీ జరిగింది. ఆభరణాలు, డబ్బు మొత్తం మీద సుమారు కోటిన్నర విలువ చేసే సొత్తు మాయం అయ్యిందని అంటున్నారు. విషయమై న్యూఢిల్లీలోని తుగ్లగ్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో సోనమ్ కపూర్ అత్త, ఆనంద్ తల్లి ప్రియా ఆహూజా ఫిర్యాదు చేశారు.

ఇప్పుడే వెలుగులోకి

ఇప్పుడే వెలుగులోకి


25 మంది సేవకులు కాకుండా, 9 మంది కేర్ టేకర్లు, డ్రైవర్లు మరో తోటమాలి సహా ఇతర ఉద్యోగులు కూడా ఆ ఇంట్లో పని చేస్తున్నారు. దీంతో పోలీసులు అందరినీ ప్రశ్నిస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ లభించలేదు. ఈ వ్యవహారం పెద్ద కుటుంబానికి చెందిందని కావడంతో పోలీసులు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచారు. ఇది ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

 ఫిబ్రవరి 23న

ఫిబ్రవరి 23న

సీనియర్ పోలీసు అధికారుల ప్రకారం, సోనమ్ కపూర్ అత్తమామలు 22 అమృత షెర్గిల్ మార్గ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ బంగ్లాలో సోనమ్ కపూర్ అమ్మమ్మ సరళా అహుజా (86), కొడుకు హరీష్ అహుజా, కోడలు ప్రియా అహుజాతో కలిసి నివసిస్తున్నారు. ఫిబ్రవరి 23న మేనేజర్ రితేష్ గౌరాతో కలిసి సరళా అహుజా, ప్రియా ఆహూజా తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ గదిలోని అల్మారా నుంచి రూ.1.40 కోట్ల విలువైన నగలు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు.

 ఫోరెన్సిక్ సైన్స్ సహాయం

ఫోరెన్సిక్ సైన్స్ సహాయం

ఫిబ్రవరి 11న అల్మీరాను తనిఖీ చేయగా నగలు, నగదు కనిపించలేదని, రెండేళ్ల క్రితమే ఆభరణాలను తనిఖీ చేశానని, ఆపై వాటిని అల్మారాలో ఉంచారని సరళా అహుజా తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో దాదాపు 25 మంది పనిమనుషులు, 9 మంది కేర్‌టేకర్లు ఉన్నారు. అందరినీ విచారిస్తున్నా ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోరెన్సిక్ సైన్స్ సహాయం తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.

బట్టల వ్యాపారం

బట్టల వ్యాపారం

పోలీసులు కేసు (ఎఫ్‌ఐఆర్‌ నం. 41/22) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏడాది కాలంగా సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా తన మామ సునీల్‌తో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ఆయన తరచూ ఢిల్లీ వస్తూ పోతూ ఉంటారు. ఇక బాధితురాలి కుటుంబం సాయి ఎక్స్‌పోర్ట్స్ అనే బట్టల ఎక్స్ పోర్ట్ కంపెనీ నడుపుతున్నారు. సరళా అహుజా 1961లో మహిళల దుస్తులు కుట్టేదని అలా మొదలైన ఆమె ప్రపంచవ్యాప్తంగా బట్టల వ్యాపారం విస్తరింపచేసిందని అంటూ ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X