twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలకే ఎక్కువనా? రెమ్యునరేషన్స్‌పై సోనమ్ కపూర్, తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్

    |

    బాలీవుడ్‌లో రెమ్యునరేషన్ చెల్లింపులో వివక్ష కొనసాగించడంపై మరోసారి యువ హీరోయిన్ సోనమ్ కపూర్ భగ్గుమన్నది. సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు చెల్లించే పారితోషికాల విషయంలో అన్యాయం జరుగుతున్నది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ పత్రికతో మాట్లాడుతూ ఇలాంటి వివక్ష కొనసాగడం చాలా దారుణం. మాకు జరిగిన అన్యాయంపై నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. కానీ ఇలా మాట్లాడితే ఆ తర్వాత నాకు అవకాశాలు తగ్గిపోతాయి. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను దానిని ఓర్చుకొంటాను. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి ఎవరిని కూడా ప్రశ్నించే, అంచనా హక్కు నాకు లేదనిపిస్తున్నది. అవకాశాలను వెతుక్కోవడం మరీ దారుణంగా మారింది అని అన్నారు.

    సినీ పరిశ్రమలో హీరోలకు తమకంటే మూడు నుంచి 5 రెట్ల మేర పారితోషికం ఎక్కువగా ఉంటుంది అంటూ తాప్సీ పన్ను అసహనం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే సోనమ్ కపూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. హీరోలు ఎక్కువ డిమాండ్ చేస్తే.. వారికి సక్సెస్ ఎక్కువ ఉందనే ఓ అభిప్రాయం ఉంటుంది అని తాప్సీ అన్నారు.

    Sonam Kapoor and Taapsee Pannu serious over Pay discrimination in Bollywood

    ఇక తన భర్తతో ఉన్న సంబంధాల గురించి వివరిస్తూ.. నా భర్త ఫెమినిస్టు, మా ఇద్దరి మనస్తత్వం ఒకటే. అలాంటి వ్యక్తి లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. సినీ పరిశ్రమకు చెందని వ్యక్తిని పెళ్లాడకపోవడంపై దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాలీవుడ్‌లో ప్రముఖుల జీవితం, ఆలోచనలు చాలా పరిమితం. గత ఏడాది కాలంగా ప్రతీ రోజు కలిసే ఉన్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో మధురానుభూతులు చోటుచేసుకొన్నాయి అని సోనమ్ కపూర్ అన్నారు.

    English summary
    Sonam Kapoor and Taapsee Pannu serious over Pay discrimination in Bollywood. Sonam said that The pay gap is ridiculous. If I talk about remunarations gap, I do not get offers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X