బురదలో పందితో అంటూ.. సోనమ్ కపూర్ దారుణమైన ట్వీట్.. కంగన రనౌత్‌పైనే అంటూ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదం జోరందుకొన్నది. సోషల్ మీడియాలోను, మీడియాలోను ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. సోనమ్ కపూర్ చేసిన ట్వీట్ ఏమిటంటే..

ఇన్‌సైడర్ వర్సెస్ అవుట్ సైడర్
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపించింది. సినీ పరిశ్రమలోని కుటుంబాలు ఓ వైపు (ఇన్‌సైడర్), సినీ పరిశ్రమకు సంబంధం లేని నటులు (అవుట్ సైడర్) అంటూ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జోరందుకొన్నది. మీడియా కూడా బాలీవుడ్ అగ్ర నటులకు అనుకూలంగా, వ్యతిరేకంగా చీలిపోయిన పరిస్థితి నెలకొని ఉంది.

రియా చక్రవర్తికి అండగా హీరోయిన్లు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని మీడియా సంస్థలు ట్రయల్స్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో రియాకు తాప్సీ, విద్యాబాలన్, స్వర భాస్కర్, మంచు లక్ష్మి లాంటి వాళ్లు అండగా నిలిస్తే.. కంగన రనౌత్‌పై రాజకీయ నేతలు, ఇతర సినీ తారలు మాటల దాడికి దిగుతున్నారు.

సోనమ్ కపూర్ ట్వీట్ వైరల్
గతంలో సోనమ్ కపూర్‌ను ఉద్దేశించి బంధుప్రీతి ఆరోపణలు చేస్తూ కంగన రనౌత్ కామెంట్లు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ సోనమ్ కపూర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ప్రముఖ రచయిత జార్జ్ బెర్నాండ్ షా కొటేషన్‌ను ఉదహరిస్తూ.. సోనమ్ దారుణంగా ట్వీట్ చేశారు. అయితే నర్మగర్భంగా చేసిన ట్వీట్ చేసిన ఆ కోటేషన్ కంగన రనౌత్‌ను ఉద్దేశించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
Recommended Video

జార్జ్ బెర్నాండ్ షా కొటేషన్ అంటూ
సోనమ్ కపూర్ ట్వీట్ చేసిన ట్వీట్‌లో.. బురదలో పందితో గొడవ పడొద్దు. దాంతో నీకే మురికి అంటుతుంది. దానికి అదంటే ఇష్టం అని నేను చాలా రోజుల క్రితం నేర్చుకొన్నాను. జార్జ్ బెర్నాండ్ షా అంటూ ఓ కొటేషన్‌ను ట్వీట్ చేసింది. అయితే ఇది ఖచ్చితంగా కంగనను ఉద్దేశించి చేసిందనే వాదన బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











