అర్ధనగ్నంగా సోనమ్ కపూర్ బేబీ బంప్‌ ఫోటోషూట్.. ట్రోల్స్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బ్యూటీ

సెలెబ్రిటీలు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు, నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. అయితే నార్త్ హీరోయిన్లు చేసే కొన్ని పనులు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నెగెటివ్ ట్రోలింగ్స్‌కు దారి తీస్తుంటాయి. నార్త్ హీరోయిన్లంతా కూడా బేబీ బంప్ ఫోటో షూట్లు అంటూ నగ్న ఫోటో షూట్లు చేస్తుంటారు. తాము గర్భం దాల్చామని చెబుతూ వింత ఫోటో షూట్లు చేస్తుంటారు. కానీ సౌత్ హీరోయిన్లు మాత్రం కాస్త పద్దతిగానే బేబీ బంప్ ఫోటో షూట్లు చేస్తుంటారు. అలా విచ్చలవిడిగా ప్రదర్శించరు. ఇదే విషయంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సోనమ్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన మాతృత్వపు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. అయితే ఆమె చాలా పద్దతిగా బిడ్డ పుట్టిందని చెబితే ఎలాంటి సమస్య లేకుండా ఉండేది. కానీ ఆమె అర్ధనగ్న భంగిమతో ఎదపై ఎలాంటి వస్త్రం లేకుండా ఓ జాకెట్ ధరించి తనకు బిడ్డ పుట్టిందని చెప్పడం చర్చనీయాంశమైంది.

బేబీ బంప్ ఫోటో షూట్లు..

బేబీ బంప్ ఫోటో షూట్లు..


బేబీ బంప్ ఫోటో షూట్లు అనే ట్రెండ్ వెస్ట్రన్ కల్చర్. అక్కడి వాళ్లు నగ్నంగానో అర్దనగ్నంగానో ఫోటో షూట్లు చేసుకుంటారు. గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటిస్తారు. ఆ మధ్య అమీ జాక్సన్ ఇలానే చేసింది. ఇక ఇక్కడ బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, సోనమ్ కపూర్ వంటి వారు కూడా అలాంటి పిచ్చి బేబీ బంప్ ఫోటో షూట్లే చేశారు. అదే సమయంలో ప్రణీత కూడా బేబీ బంప్ ఫోటో షూట్ చేసింది. కానీ ఎక్కడా కూడా వల్గారిటీకి తావివ్వలేదు.

సోనమ్ కపూర్‌పై ట్రోలింగ్..

సోనమ్ కపూర్‌పై ట్రోలింగ్..


మామూలుగానే ఇప్పుడు బాలీవుడ్ మీద జనాలు ఆగ్రహంతో ఊగిపోతోన్నారు. ఈక్రమంలో సోనమ్ కపూర్ బేబీ బంప్ విషయం చర్చకు వచ్చింది. సోనమ్ కపూర్‌కు పండంటి బిడ్డ పుట్టిందంటూ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇట్సే బేబీ బాయ్ అంటూ అందరూ ట్వీట్లు పోస్టులు వేస్తున్నారు. అయితే బేబీ బంప్ ఫోటో షూట్ల మీద నెటిజన్లు మండి పడుతున్నారు.

ఇదేనా పద్దతి?

ఇదేనా పద్దతి?


సోనమ్ కపూర్ బేబీ బంప్ ఫోటో షూట్లు మరీ దారుణంగా ఉన్నాయి. అందులోనూ అందాల ప్రదర్శనే ఉండటంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పుట్టాడని చెప్పడానికి కూడా ఇలానేనా చేసేది? ఇదేనా పద్దతి అంటూ నానా రకాలుగా సోనమ్ కపూర్‌ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఇక వీటిపై సోనమ్ కపూర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది.

సోనమ్ రియాక్షన్..


కెరీర్ స్టార్టింగ్‌లో ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఏజ్ పెరుగుతున్నా కొద్ది నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను.. ఎంతో లగ్జరీ జీవితాన్ని గడిపే ఫ్యామిలీ నుంచి వచ్చాను..మా మీద ఇలాంటి నెగెటివ్ వార్తలు వస్తుంటాయి.ఎవరో ఎక్కడో రాసేదాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఒకవేళ నా బాడీ, నా మాతృత్వాన్ని నేను ప్రదర్శించుకోవాలనుకుంటే అది తప్పేమీ కాదు.. సర్‌ప్రైజ్ కాదు.. నేను ప్రతీది ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నదాన్ని అంటూ సోనమ్ కపూర్ స్పందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X