ర్యాంప్ వాక్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఆయన గుర్తొచ్చాడట

మనకు ఇష్టమైన వారు గుర్తుకు వచ్చే ఎమోషనల్ అవుతాం. అలాంటి వారు మన మధ్య లేనప్పుడూ.. మనకు తెలియకుండానే ఎమోషనల్ అవుతాం.. వారిని తలుచుకుని భావోద్వేగానికి లోనవుతాం. అది సెలబ్రిటీ అయినా.. సామాన్య వ్యక్తి అయినా.. మన ఫీలింగ్ వ్యక్తం చేస్తాం. అలా ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేస్తూ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ అందర్నీ ఏడ్చేలా చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ఆమె స్టేజ్ పై ఏడవడానికి గల కారణమేంటి? ఓకే లూక్కెయ్యండి?

ఆ అమ్మడు ఎవరో కాదు.. నటి సోనమ్‌ కపూర్‌ (Sonam kappor). ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె. తన తండ్రి వారసత్వంలో ఇండస్ట్రీలోకి స్టార్‌ కిడ్‌గా అడుగుపెట్టింది. కానీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి, మెప్పించింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Sonam Kapoor breaks down on while walking the ramp Remembering Designer Rohit Bal

సోనమ్ తన కెరీర్ లో నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. ఈ అమ్మడు 2018 మేలో భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కొడుకు. మ్యారేజ్ అయిన నాటి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన సినిమాలతో పాటు, ఫ్యాషన్ షోల్లో, ఈవెంట్స్ లో మంచి పాపులర్టీ సొంతం చేసుకుంది. అలాగే.. సోషల్ మీడియాలో కూడా చర్చ చేస్తోంది. తన హాట్ హాట్ ఫోటోలతో తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.అలా సోనమ్ తన హాట్ లుక్స్ ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటాయి.

తాజాగా లెజెండరీ డిజైనర్ రోహిత్ బాల్ జ్ఞాపకార్థం ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షోలో హీరోయిన్ సోమన్ కపూర్ కూడా ఆ షోలో పాల్గొంది. ఈ ర్యాంప్ వాక్ సమయంలో సోనమ్ కపూర్ ఆఫ్-వైట్ డ్రెస్ ధరించి నడిచింది. క్యూట్ లూక్స్ తో మెస్మారైజ్ చేసింది. అందరూ చూస్తుండగా.. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ .. సడెన్ గా భావోద్వేగానికి లోనైంది. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్​గా మారింది.,,

అనంతరం సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. లెజెండరీ డిజైనర్ రోహిత్‌ బాల్‌ కళాత్మకత, దార్శనికతతో భారతీయ ఫ్యాషన్‌ రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ఆయనను గుర్తు చేసుకుంటూ ర్యాంప్‌పైకి నడవడంతో భావోద్వానికి లోనయ్యాను.ఆయనది స్ఫూర్తిదాయకమైన ప్రయాణమని ఆమె పేర్కొన్నారు. రోహిత్‌ బాల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఆయన డిజైన్‌ చేసిన దుస్తులనే తాను ఎక్కువగా సెలక్ట్‌ చేసుకునేదాన్ని అనీ, ఈ షోలో పాల్గొవడానికి ముందు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్‌ బాల్‌.. 1986లో తన సోదరుడు రాజీవ్‌తో కలిసి కెరీర్‌ను ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ఈ రంగంలో తనదైన ముద్ర వేసి అనేక అవార్డులు అందుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఇక సోనమ్ విషయానికి వస్తే.. 2023లో విడుదలైన 'బ్లైండ్‌' సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం అనుజా చౌహాన్ రాసిన 'బ్యాటిల్ ఫర్ బిట్టోరా' నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది.

More from Filmibeat

Read more about: sonam kapor rohit bal bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X