twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Foolish.. ఇలానే మాట్లాడుతారా? RSS చీఫ్‌పై మండిపడ్డ సోనమ్ కపూర్

    |

    బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎదైనా విషయంపై తనకు తోచినట్టు కుండ బద్దలు కొట్టి చెప్పడం పలు సందర్భాల్లో స్పష్టమైంది. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై సోనమ్ తీవ్రంగా మండిపడ్డారు. సంపన్న కుటుంబాల్లో విడాకుల అంశం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. ఇంతకు ఈ వివాదంలో ఏం జరిగిందంటే..

    ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో

    ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో

    ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 16వ తేదీన ఆహ్మదాబాద్‌లో తమ సంస్థకు సంబంధించిన కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా చదువుకొన్న.. సంపన్న కుటుంబాల్లో వైవాహిక సంబంధాలు దారణంగా ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో విడాకులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని మోహన్ భగవత్ అన్నారు.

    సంపన్న కుటుంబాల్లో

    సంపన్న కుటుంబాల్లో

    సంపన్న కుటుంబాల్లో ఎక్కువ చదువుకొన్నామనే గర్వం వైవాహిక జీవితాల్లో చిచ్చు పెడుతున్నది. దాని ఫలితమే విడాకుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. సమాజం ఇలాంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. హిందూ సమాజం అంటే ఓ పద్దతిగా, లక్షణంగా నడిచే వ్యవస్థ. సొసైటీ అంటే మగవాళ్లే కాదు.. మహిళల భాగస్వామ్యం కూడా బలంగా ఉంటుంది. అదే సమాజానికి బలమైన అస్థిత్వం అని మోహన్ భగవత్ తెలిపారు.

    ఇంటికే పరిమితం

    ఇంటికే పరిమితం

    మనం పాటించే ఆచార వ్యవహారాలే సమాజం, హిందూ వ్యవస్థకు బలమైన పునాది. గత 2 వేల సంవత్సరాలుగా అలాంటి ఆచారాలను సమాజం పాటిస్తున్నది. ఆడవాళ్లు కేవలం ఇంటికి పరిమితమవ్వడం 2 వేల సంవత్సరాల నుంచి కాదు.. సమాజం స్వర్ణయుగం అని చెప్పుకొనే అప్పటి నుంచి ఇలాంటి సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి అంటూ కార్యకర్తల సమావేశంలో మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Sonam Kapoor's Scary Experience With Uber Cab Driver In London
    విచక్షణ కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలేనా?

    విచక్షణ కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలేనా?

    ఇలా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. విచక్షణ కలిగిన పెద్ద మనిషి ఎవరైనా ఇలా మాట్లాడుతారా? వ్యవస్థను, సమాజాన్ని కించపరిచే విధంగా అభ్యంతరకరమైన ఫూలీష్ వ్యాఖ్యలు చేయడం తగదు. ఇలాంటి వ్యాఖ్యలు తిరోగమనానికి సూచిక అని సోనమ్ కపూర్ ఘాటుగా స్పందించారు.

    English summary
    Bollywood actress Sonam Kapoor faults on RSS Chief Mohan Bhagwat comments over divorce in affluent family. Sonam responded that, Which Sane man speaks like this? Regressive foolish statements.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X