నెగిటివిటీ భరించలేకే.. సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన సోనమ్!
సోషల్ మీడియాలో సెలెబ్రెటీలకు తరచుగా ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంటుంది. ఎదో ఒక కారణం చేత సెలెబ్రిటీలు వివాదంలో చిక్కుకుంటే.. ట్రోలింగ్ ద్వారా నెటిజన్లు వారిని ఒక ఆట ఆడుకుంటారు. పలు సందర్భంలో హీరోయిన్లు ట్రోలింగ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తాజగా స్టార్ హెరాయిన్ సోనమ్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ నుంచి కొంత కాలం దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువవుతుండడం వలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోనమ్ కపూర్ తాజగా ట్వీట్ చేసింది.
కొన్ని నెలల క్రితమే సోనమ్ కపూర్ తన ప్రియుడు ఆనంద్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పలు సందర్భంలో సోనమ్ కపూర్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.


Click it and Unblock the Notifications











