హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా? ఆ డబ్బుతో కాస్ట్లీ కారు కొనవచ్చు!
సెలబ్రెటీలు డబ్బు సేవ్ చేసుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాగ్స్ కాస్ట్లీ లైఫ్ ని అనుభవించడంలో కూడా అంతే తెలివిగా అడుగులు వేస్తుంటారు. వారు వాడే వస్తువుల ఖరుదు చూస్తే ఒక్కోసారి సామాన్యుడి మైండ్ బ్లాక్ అవ్వకుండా ఉండలేదు. మెయిన్ గా హీరోయిన్స్ ఫ్యాషన్ అంటూ యూజ్ చేసే బ్రాండ్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. బాలీవుడ్ లో ఆ డోస్ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు సోనమ్ కపూర్ కి చెందిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోనమ్ ఎప్పుడు బయటకు వెళ్లినా ఆమె రిచ్ ఉమెన్ గా తనను తాను ప్రజెంట్ చేసుకుంటుంది. ఫ్యాషన్ వరల్డ్ లో అమ్మడు అన్ని రకాల డ్రెస్సులను వాడేసింది. ఇక సోనమ్ ఎక్కువగా ఇష్టపడే హ్యాండ్ బ్యాగ్ ప్రైజ్ ట్యాగ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె దగ్గర ప్రపంచంలోని అత్యంత ఖరీదైన అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయట.

సోనమ్ కి ఎక్కువగా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ ఏదంటే.. బిర్కీన్ 40 హెర్మ్స్ బ్యాగ్. ఆ బ్యాగ్ ఖర్చు ఎంతో తెలుసా?. ఇండియాన్ కరెన్సీలో 8 లక్షల 60వేల రూపాయలు. ఈ నెంబర్ తో మంచి కారు కొనవచ్చు కదా..!. సోనమ్ కి ఇలాంటి బ్యాగ్స్ చాలానే ఉన్నాయి. మరి వాటి ఖర్చు ఎంత ఉంటుందో గాని.. ఆమె ఎక్కువగా ఇష్టపడే బ్యాగ్ ఇదేనట. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











