For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!

  |

  దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలు అన్నింట్లోనూ పెద్ద పెద్ద స్టార్లు తమ వారసులను ఈ రంగానికి పరిచయం చేసుకున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా హీరోయిన్లుగా తీసుకు వచ్చారు. అందులో బాలీవుడ్ బడా స్టార్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ కిడ్‌గా ప్రపంచానికి పరిచయం అయినా.. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన అభినయంతో ఆరంభంలోనే మాయ చేసిందీ భామ.

  ఆ తర్వాత తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుని స్టార్‌గా. ఇక, కొన్ని నెలల క్రితమే ప్రెగ్నెంట్ అయిన సోనమ్ తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ సంచలనం అవుతోంది. అసలేం జరిగింది? ఆ వివరాలపై మీరూ లుక్కేయండి!

   అలా ఎంట్రీ... స్టార్ హీరోయిన్‌

  అలా ఎంట్రీ... స్టార్ హీరోయిన్‌

  అనిల్ కపూర్ కూతురిగా ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన అభినయాన్ని కనబరిచింది. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు గ్రాండ్ ఎంట్రీని కూడా సొంతం చేసుకుంది. తర్వాత ఎన్నో విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

  బిగ్ బాస్ దివి అరాచకం: అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో

  ప్రేమ పెళ్లి.. కెరీర్‌కు బ్రేక్‌లు

  ప్రేమ పెళ్లి.. కెరీర్‌కు బ్రేక్‌లు


  సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కెరీర్‌ను అనుకున్నంత స్పీడుగా నడుపుకోలేకపోయిందనే చెప్పుకోవాలి.

  తల్లి అవుతున్నట్లు ప్రకటించి

  తల్లి అవుతున్నట్లు ప్రకటించి


  చాలా కాలం పాటు సోనమ్ కపూర్ సినిమాల వేగం తగ్గించడంతో ఆమె గర్బవతి అయిందని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

  శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

   పండంటి బిడ్డకు తల్లైన నటి

  పండంటి బిడ్డకు తల్లైన నటి


  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ శనివారం అంటే ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు సోనమ్ కపూర్, ఇటు ఆమె భర్త ఆనంద్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో వాళ్లకు ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

  ఇది ప్రారంభం మాత్రమే అని

  ఇది ప్రారంభం మాత్రమే అని


  తల్లైన విషయాన్ని తెలుపుతూ సోనమ్ 'ఆగస్టు 20, 2022.. మా బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్స్, నర్సులు, ఫ్యామిలీ, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రారంభం మాత్రమే, మా బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు. ఇట్లు మీ సోనమ్‌ ఆనంద్‌' అని పోస్ట్ చేసింది.

  హాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోత

  ఆ ఫొటోతో వోగ్ శుభాకాంక్షలు

  ఆ ఫొటోతో వోగ్ శుభాకాంక్షలు


  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ తల్లైన విషయం తెలియగానే.. ఆమెతో పాటు ఆనంద్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే, పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీలు సైతం వాళ్లను విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యాగజైన్ 'వోగ్' సోనమ్ కపూర్ గర్భంతో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేసింది.

  ఇష్టం లేకుండా అని షాకింగ్‌గా

  ఇష్టం లేకుండా అని షాకింగ్‌గా


  వోగ్ సోషల్ మీడియా ఖాతాలో 'ప్రాధాన్యతలు మారతాయి. పిల్లవాడు నావాడు అవుతాడని భావిస్తున్నాను. వాస్తవం ఏమిటంటే తను ఈ ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడలేదు. కానీ, ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇది చాలా స్వార్థపూరితమైన నిర్ణయం' అని సోనమ్ కపూర్ వెల్లడించినట్లు పోస్ట్ చేసింది. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Bollywood Actress Sonam Kapoor Ahuja is Very Busy In Social Media. Now She Shared her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X