For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండస్ట్రీలో మొత్తం అలాంటి వాళ్లే.. హీరోని పెళ్లి చేసుకోపోడానికి కారణం అదే: హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  |

  మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు కనిపిస్తుంటాయి. అందులోనూ ఈ వ్యవహారాలన్నీ బాలీవుడ్‌లోనే ఎక్కువ జరుగుతుంటాయి. దీంతో అక్కడ ఇవి సర్వసాధారణమే అయినప్పటికీ.. సెలెబ్రిటీల కహానీలు జనాలకు మాత్రం చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇక, ఇటీవలే మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్, స్టార్ డాటర్ సోనమ్ కపూర్ తన పెళ్లిపైనా.. ఇండస్ట్రీలోని వ్యవహారాలపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  ఫస్ట్ మూవీతోనే గుర్తింపు.. ఫాలోయింగ్

  ఫస్ట్ మూవీతోనే గుర్తింపు.. ఫాలోయింగ్

  సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సోనమ్ కపూర్. ‘సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి దానితోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది. తద్వారా ఆరంభంలోనే మంచి పేరుతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంది.

  చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, కేటీఆర్‌తో తెలంగాణ మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ భేటీ

  అన్నీ ఉత్తమ చిత్రాలే.. అవార్డుల పంట

  అన్నీ ఉత్తమ చిత్రాలే.. అవార్డుల పంట

  కెరీర్ మొత్తంలో సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే. కానీ, వాటిలో గొప్ప ప్రదర్శనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. మరీ ముఖ్యంగా ‘నీర్జా' మూవీ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. దీనితో పాటు ‘ప్రేమ్ రతన్ దన్ పాయో', ‘ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది.

  నందినీ రాయ్ గ్లామర్ ట్రీట్ అదుర్స్: అందాలతో హైదరాబాదీ బ్యూటీ వల.. ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన ఫొటోలు ఇవే

  వ్యాపారవేత్తను పెళ్లాడిన బాలీవుడ్ భామ

  వ్యాపారవేత్తను పెళ్లాడిన బాలీవుడ్ భామ

  వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ లోకం అంతా వచ్చింది. వాళ్లతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరయ్యారు. ఆనంద్‌తో వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని పేరును సైతం మార్చుకుందామె.

  మరోసారి క్లివేజ్ షోతో హద్దులు దాటేసి జాన్వీ కపూర్.. హాట్ ఫొటోస్

  పెళ్లి గురించి సోనమ్ సంచలన వ్యాఖ్యలు

  పెళ్లి గురించి సోనమ్ సంచలన వ్యాఖ్యలు

  ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత వేగం తగ్గించేసింది. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ డాటర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వివాహం.. ఇండస్ట్రీలోని పెళ్లిళ్లు, బ్రేకప్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

  అద్భుతమైన కాశ్మీర్‌లో చిన్మయి పాటకు నట్టి కరుణ అభినయం

  ఇండస్ట్రీలో మొత్తం అలాంటి వాళ్లేనంటూ

  ఇండస్ట్రీలో మొత్తం అలాంటి వాళ్లేనంటూ

  సినీ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ల గురించి స్టార్ డాటర్ సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో పని చేసే వాళ్ల ప్రపంచం ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ల ఆలోచనలు ఎప్పుడూ ఒకలా ఉండవు. అందుకే ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. అందుకే ఇక్కడి వ్యక్తులను పెళ్లి చేసుకోకూడదని భావించే ఆనంద్‌తో ఏడడుగులు వేశాను' అంటూ బాంబ్ పేల్చింది.

  #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు
  హీరోని పెళ్లి చేసుకోపోడానికి కారణం అదే

  హీరోని పెళ్లి చేసుకోపోడానికి కారణం అదే

  తన వివాహం గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి చెందిన హీరోనో.. ఇతర వ్యక్తులనో చేసుకోకపోవడానికి కారణం అదే. దేవుడి దయ వల్లే నేనా పని చేయలేదు. ఇక, ఆనంద్ ఎప్పుడూ నాలాగే ఆలోచిస్తాడు. ఫెమినిజం భావజాలం ఉన్న వ్యక్తి. అతడిని వివాహం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే చాలా మందిలా కాకుండా సంతోషంగా ఉన్నాను' అంటూ సోనమ్ చెప్పింది.

  English summary
  Bollywood Actress Sonam Kapoor Ahuja Recently Participated in An Interview. In This Chit Chat She Shockingly Commented about her Marriage and Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X