‘నీ బెలూన్లు ఎందుకు పెద్దవయ్యాయి’ సోనమ్ కపూర్‌కు నెటిజన్ల షాక్
అనిల్ కపూర్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది సోనమ్ కపూర్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. 'సవారియా', 'ప్రేమ్ రతన్ దన్ పాయో', 'నీర్జా' వంటి చిత్రాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన సోనమ్.. ఆయా సినిమాలకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలో గత సంవత్సరం ఆనంద్ అహుజాను వివాహం చేసుకుంది.


సోషల్ మీడియాలో యాక్టివ్
చేతి నిండా సినిమాలు ఉన్నా సోనమ్ కపూర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన రోజువారీ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడిదే ఆమె కొంప ముంచింది.

సోనమ్ ఫొటో వైరల్
నిరంతరం సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, సినిమా విషయాలను పంచుకునే సోనమ్.. ఇటీవల ఓ సమావేశానికి హాజరైంది. ఈ సందర్భంగా తీసిన రెండు ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు బాగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ వైరల్ అయిపోయింది.

‘నీ బెలూన్లు ఎందుకు పెద్దవయ్యాయి'
ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సోనమ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, చిత్ర విచిత్ర ప్రశ్నలు అడుగుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటో చూసి ‘‘నీ బెలూన్స్ పెద్దవయ్యాయి'' అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘ఉన్నట్లుండి నీ వక్షోజాలు చాలా పెద్దగా అయ్యాయి. అది ఎలా సాధ్యమైంది.? కాస్మోటిక్ సర్జరీ చేయించారా? మా స్నేహితుల కోసం వాటి నెంబర్ తెలుసుకోవచ్చా.?'' అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే రాయడానికి వీలు లేని భాషలో ప్రశ్నలు వదులుతున్నారు.

గతంలోనూ విమర్శలు
సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై ఆమె అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫొటోలలో ఆమె వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు. అంతేకాదు, నీకు డ్రెస్ సెన్స్ లేదా అంటూ ప్రశ్నించారు.

పోస్ట్ డిలీట్
సోనమ్ కపూర్ ఫొటోకు ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆమె తన పోస్టును డిలీట్ చేసేశారు. అయితే, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
లండన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లాడడంతో సోనమ్ ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా ఉంటోంది. దీంతో సినిమాలు కూడా బాగా తగ్గించేసింది. అంతేకాదు, కథలు వినాల్సి వచ్చినా తన పాత్రకు ప్రాధాన్యమున్న వాటినే ఎంపిక చేసుకుంటోంది. ఈ ఏడాది ఆమె ‘‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా''తో ప్రేక్షకుల ముందుకు రాగా, ‘‘ది జోయా ఫ్యాక్టర్'' అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











