ఎవరో ఒకరు మరణిస్తే.. గర్ల్‌ఫ్రెండ్, మాజీ ప్రేయసిని టార్గెట్ చేస్తారా? సోనమ్ వివాదాస్పద ట్వీట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్‌లో ప్రకంపనాలు మొదలయ్యాయి. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయి ఓ వర్గం మరో వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొంటున్నారు. బాలీవుడ్ మాఫియా వల్లే సుశాంత్ మరణించారని, ఓ ఎలైట్ క్లబ్ కారణంగానే ఆయన మనస్తాపం చెంది తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారనే వాదనలు మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోనమ్ కపూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది..

బాలీవుడ్‌లో వారసత్వం జోరు..

బాలీవుడ్‌లో వారసత్వం జోరు..

బాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చే వారికి అవకాశాలు లభిస్తున్నాయి. జోహర్, ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చే వారికే ఆఫర్లు ఇస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేని వారికి ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో డిప్రెషన్‌కు గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు అనే ఆరోపణలు మరోసారి మొదలయ్యాయి.

కరణ్, ఆలియాభట్‌ను టార్గెట్‌గా

కరణ్, ఆలియాభట్‌ను టార్గెట్‌గా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వివాదాస్పదంగా మారడం, ప్రతీ ఒక్కరిని ఎమోషనల్‌గా కదిలించడంతో కరణ్ జోహర్, ఆలియాభట్‌ను టార్గెట్ చేసుకొన్నారు. గతంలో సుశాంత్ ఎవరో నాకు తెలియదు అని వ్యాఖ్యలు చేయడంతో ఆమెను నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. కరణ్ జోహర్ ప్రతిభావంతులకు కాకుండా స్టార్స్, డైరెక్టర్ల పిల్లలనే ప్రమోట్ చేస్తారు. సుశాంత్ లాంటి వారిని పట్టించుకోరు అనే విమర్శలతో ట్వీట్లతో టెండ్ చేశారు.

సోనమ్ కపూర్ వివాదాస్పద ట్వీట్

సోనమ్ కపూర్ వివాదాస్పద ట్వీట్

ఇలాంటి వివాదాల మధ్య అనిల్ కపూర్ కుమార్తె, హీరోయిన్ సోనమ్ కపూర్ ట్విట్టర్‌లో స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో బ్లేమ్ గేమ్ ఆడోద్దు. ప్రముఖులను హిపోక్రాట్స్ అంటూ దూషించవద్దు. ఈ క్రమంలో ఇలాంటి దూషణలు, ఆరోపణలు చేయడం సరికాదు అంటే విధంగా కామెంట్ చేశారు.

చనిపోతే ప్రేయసి, మాజీ ప్రేయసిని టార్గెట్ చేస్తారా?

చనిపోతే ప్రేయసి, మాజీ ప్రేయసిని టార్గెట్ చేస్తారా?

ఒకరు చనిపోతే.. ఆ క్రమంలో ఆయన గర్ల్‌ఫ్రెండ్‌నో, లేదా మాజీ ప్రేయసినో, మరో ఫ్యామిలీలోనో లేదా కొలీగ్స్‌ను టార్గెట్ చేయవద్దు. అలాంటి వాటిని వదిలేయడమే పక్కా స్పూర్తిగా నిలుస్తుంది అంటూ సోనమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సోనమ్ చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నీకు మాదిరిగా సుశాంత్‌కు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుండేది. అది లేకనే కనుమరుగుయ్యాడు అంటూ కామెంట్ల విసురుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X