సోనియాతో పెళ్లికి అతడే అడ్డు.. అసలు విషయం చెప్పిన కాబోయే భర్త!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో తళుక్కున మెరిసి మాయమైన సోనియా ఆకుల గత కొద్దికాలంగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకొంటున్నది. అయితే ఇంటిలోనే ఉన్న సమయంలోనే తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే తాజాగా కొద్దికాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వివాహితుడిని పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని వారే స్వయంగా చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన కరోనా వైరస్‌తోపాటు జార్జిరెడ్డి, ఆషా ఎన్‌కౌంటర్ చిత్రాల్లో నటించినప్పటికీ.. సోనియాకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత తన గ్లామర్, మాట తీరు, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులను కూడా సంపాదించుకొన్నారు.

Sonia Akula of Bigg Boss Telugu 8 fame marriage fixed Here is date and Plance details

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షోలో సోనియా వ్యవహారం హాట్ టాపిక్‌గానే కాకుండా హైలెట్‌గా మారింది. నిఖిల్, పృథ్వీతో స్పెషల్ బాండింగ్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే వారితో తన రిలేషన్‌ను చక్కగా సమర్ధించుకొన్నది. అన్నాచెల్లెల కంటే ఎక్కువ బంధం మా మధ్య ఉందని ఆమె చెప్పారు. అయినా నిఖిల్‌తో నీకున్న రిలేషన్ ఏంటని గుచ్చి గుచ్చి అడిగారు.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌లో ఉండగానే.. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నా బాయ్‌ఫ్రెండ్ అమెరికాలో ఉంటారు. మేమిద్దరం బిజినెస్ పార్ట్‌నర్స్. ఆయనకు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. కానీ విడాకులు తీసుకోబోతున్నాడు. ఆ ప్రాసెస్ ముగిసిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను అని బిగ్‌బాస్ షోలోనే వెల్లడించింది. అయితే టాప్ 5లో ఉంటుందని అనుకొన్న ఈ అమ్మాయి త్వరగానే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యంగా మారింది.

Sonia Akula of Bigg Boss Telugu 8 fame marriage fixed Here is date and Plance details

అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి యష్. ఆయనకు అమెరికాలో బిజినెస్ ఉంది. టూరిజం బిజినెస్‌ను ఆయన నిర్వహిస్తున్నాడు. నేను ఆయన బిజినెస్‌లో పార్ట్‌నర్‌ను. కోవిడ్ సమయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. దాంతో మా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం అని సోనియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా, సోనియాతో పెళ్లి గురించి యష్ మాట్లాడుతూ.. వాస్తవానికి బిగ్‌బాస్ తెలుగు 8 షోకు వెళ్లకముందే వివాహం చేసుకోవాలని అనుకొన్నాం. కానీ ఆఫర్ రావడంతో మ్యారేజ్ తర్వాత చేసుకొందామని అనుకొన్నాం. బిగ్‌బాస్ అడ్డు పడకపోకపోతే మా పెళ్లి ఎప్పుడో అయిపోయేది. కానీ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిపాడు. ఆయన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే వీరిద్దరి పెళ్లి హైదరాబాద్‌లో జరిగేలా ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X