సీక్రెట్ కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలు.. అప్పటి నుంచి క్యారవాన్ అంటే భయం.. సీనియర నటి రాధిక సెన్సేషనల్ కామెంట
Radhika Sarathkumar: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు పలు ఇండస్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో పలు సంచలన విషయాలు బయటకు రావడంతో చాలామంది సినీ ప్రముఖులు ఈ నివేదికపై స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక శరత్ కుమార్ కూడా తన అభిప్రాయాలను, తాను ఎదుర్కొన్న షాకింగ్ విషయాలను వెల్లడించింది.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై సీనియర్ నటీ రాధిక శరత్ కుమార్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. తాను 46 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాననీ, అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి సమస్యలే మహిళలకు ఎదుర్కొన్నారని అన్నారు. తాను కూడా ఒకసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాననీ, తాను ఓ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్ళినప్పుడు జరిగిన ఓ సంఘటన తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎందుకంటే.. తాను షాట్ కంప్లీట్ చేసుకొని వెళ్తుంటే.. సెట్‌లో ఉన్న కొందరూ పురుషులు ఒకేచోట చేరి ఫోన్‌లో ఏదో చూస్తూ.. నవ్వుకుంటున్నారు. ఆ విషయాన్ని గమనిస్తే.. తనకు అనుమానం వచ్చి.. ఓ వ్యక్తి పిలిచి ఏం జరుగుతుందని ఆరా తీశాననీ, క్యారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. లేడీ యాక్టర్ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి చూస్తున్నారని ఆ వ్యక్తి చెప్పాడు.

ఆ విషయం వినగానే తాను షాకయ్యానని తెలిపారు. వెంటనే ఆ విషయాన్ని మిగతా లేడీ యాక్టర్ తో చెప్పి జాగ్రత్తగా ఉండండని తాను చెప్పానని అన్నారు. ఆ తరువాత తాను మూవీ టీమ్‌కు కంప్లైంట్ చేశానని వెల్లడించారు. ఆ తరువాత వారికి బుద్ధి చెప్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని అన్నారు. అప్పటి నుంచి క్యారవాన్ ఎక్కాలంటే.. భయపడుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే.. జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు పై ఇండస్ట్రీలోని పెద్ద హీరోలు మౌనంగా ఉండాన్ని ఆమె తీవ్రంగా తప్పుబడ్డారు. మహిళలకు రక్షించుకునే బాధ్యత వారికి లేదా? ఈ విషయాన్ని వారు భుజాలపై వేసుకోవాలని నటి రాధిక సూచించారు.
ఇదిలాఉంటే.. నటీ రాధిక సంచలన ఆరోపణలపై ఎంపీ నేత కేకే రెమా స్పందించారు. సీని ఇండస్ట్రీలో జరిగిన దారుణాలు ఊహకు కూడా అందడం లేదనీ, ఇది ఎంత క్రూరత్వం ఉంటే.. సినిమా ప్రపంచం అంతరించుపోయి.. అండర్ వరల్డ్‌గా మారుతోందని అన్నారు. రోజు రోజుకీ వెలుగులోకి వస్తున్న ఆరోపణలను చూస్తుంటే.. అసలు ఏం జరుగుతుందో.. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నామన్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్ట్‌లు క్యారవాన్ సురక్షితమని నమ్ముతారు. కానీ, రాధిక మాటలు వింటే అది నిజం కాదని రెమా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే మాలీవుడ్‌లో జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదల తర్వాత చాలా మంది బాధితులు బయటికి వచ్చి ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా చెప్తున్నారు. ఇక తాజాగా నటి రాధిక శరత్ కుమార్ చేసిన ఆరోపణ మాలీవుడ్‌లో ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు చెలారేగుతున్నాయి. హేమా కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యమైందని, కేవలం మలయాళ ఇండస్ట్రీ కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక :

మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. కేరళ గవర్నమెంట్ ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి హేమా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జికే హేమ ఆ కమిషన్‌కు నాయకత్వం వహించగా.. నటి శారదతోపాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. కాగా.. ఈ కమిషన్ ఇటీవలే తన షాకింగ్ నివేదికను సీఎం విజయన్‌కు అందించింది. ఈ రిపోర్టులో షాకింగ్ నివేదిక వెల్లడించింది. అవకాశాల పేరిట మహిళ ఆర్టిస్టులను లొంగదీసుకున్నారనీ, లొంగని వారిని ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని పలు సంచనాలను వెల్లడించింది. కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ అందరూ ఒక టీంగా ఏర్పడ్డరని కమిటీ నివేదిక లో ఆరోపించింది.
'అమ్మ'కు మోహన్‌లాల్ రాజీనామా
కేరళ ప్రభుత్వానికి హేమ కమిటీ నివేదిక అందించిన నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA)అధ్యక్షులు మోహన్ లాల్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మొత్తం 17 మంది అసోషియన్ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు నెలల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఇటీవలే ప్రకటించింది. మరో సంచలన విషయమేమింటంటే.. AMMA మెంబర్లు గా ఉన్నా దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్‌లు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











