సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. రూమర్లకు చెక్ చెబుతూ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నటించి మెప్పించిన షీలా కౌర్ ఎట్టకేలకు పెళ్లి చేసుకొని తనపై వస్తున్న రూమర్లకు ముగింపు పలికింది. కొద్దికాలం క్రితం టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతతో సహజీవనం చేస్తుందనే వార్తలు రావడం సంచలనం రేపింది. అయితే తాజాగా షీలా వివాహంలో జరిగినట్టు ఓ ఫోటో మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే అధికారికంగా షీలా నుంచి గానీ, షీలా కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇంకా ఆమె పెళ్లిపై అసందిగ్దత కొనసాగుతున్నది. వివరాల్లోకి వెళితే..

కెరీర్ జోరుగా సాగుతుండగానే..
టాలీవుడ్ యువ హీరోలతో జత కట్టిన షీలా కొద్దికాలంగా తెలుగు తెరకు దూరమైంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా.. అనూహ్యంగా కనుమరుగు కావడంతో అనేక రూమర్లు మీడియాలో స్వైర విహారం చేశాయి. ప్రముఖ నిర్మాతతో సహజీవనం చేస్తుందనే వార్తలు రావడం, ఆ నిర్మాత వివరణ ఇవ్వడంతో ఆ రూమర్లకు తెరపడ్డాయి. అయినా ఆమె వెండితెర మీద కనిపించకుండానే ఉండిపోయింది.

చెన్నైలో షీలా కౌర్ పెళ్లి
ఇదిలా ఉండగా, సంతోష్‌రెడ్డి అనే వ్యక్తితో షీలా కౌర్ వివాహం జరిగిందనే వార్త మీడియాలో గుప్పుమన్నది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు, సన్నిహితులు ఈ వివాహ వేడుకకు హాజరైనట్టు సమాచారం. అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు గానీ.. దక్షిణాదికి చెందిన వారెవరైనా హాజరయ్యారా అనే విషయంపై క్లారిటీ రాలేదు.

బాలతారగా ప్రవేశించి..
షీలా కెరీర్ విషయానికి వస్తే.. బాలతారగా దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయం అయింది. తమిళంలో పూవ్వే ఉనక్కగా, గోల్‌మాల్, మాయ, నందా లాంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. ఆ తర్వాత దీనా అనే చిత్రంతో హీరోయిన్‌గా తమిళ రంగానికి పరిచయం అయింది.
Recommended Video


తెలుగులో యువ హీరోలతో..
ఇక తెలుగులో 2006లో సీతాకోక చిలుక చిత్రంతో హీరోయిన్'గా అడుగుపెట్టింది. ఆ తర్వాత రాజుభాయ్, హల్లో ప్రేమిస్తా, అల్లు అర్జున్‌తో పరుగు, రామ్‌తో మస్కా, ఎన్టీఆర్‌తో అదుర్స్, పరమ వీర చక్రలో నటించింది. 2018లో హైపర్ అనే కన్నడ చిత్రంలో చివరిసారిగా కనిపించింది.


Click it and Unblock the Notifications











