త్రిషకు భాద్యత లేదా.. తీవ్రమైన వివాదంగా మారుతున్న ముద్దు ముచ్చట్లు!

Recommended Video

Actress Trisha Krishnan Faces Another Controversial Issue

క్రేజీ హీరోయిన్ త్రిష మరోమారు వివాదంలో చిక్కుకుంది. వర్షం, నువ్వొస్తానంటే నేనోద్దంటానా, ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే. స్టాలిన్ వంటి చిత్రాలతో సౌత్ లో త్రిష స్టార్ హీరోయిన్ గా మారింది. యువ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చిన తరువాత త్రిషకు బాగా అవకాశాలు తగ్గాయి. అడపాదడపా కొన్ని చిత్రాలు, లేడీఓరియేంటేడ్ చిత్రాలు చేస్తూ గడుపుతోంది. ఇటీవల త్రిష సూపర్ స్టార్ రజనీ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నా సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా త్రిష వివాదాల్లో నిలవడం కొత్త కాదు. జల్సా రాయుడిలా ఆమె చేసే పనులే త్రిష మెడకు చిక్కుకుంటున్నాయి.

విదేశాల్లో హల్ చల్

విదేశాల్లో హల్ చల్

త్రిష విదేశాల్లో విహారయాత్రలు బాగానే చేస్తోంది. తాజగా దుబాయ్ లో విహార యాత్ర సందర్భంగా త్రిష చేసిన పని ఆమె మెడకే చుట్టుకుంది. దుబాయ్ లోని ఈత కొలనులో త్రిష ఓ డాల్ఫిన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అసలు చిక్కంతా అక్కడే

అసలు చిక్కంతా అక్కడే

డాల్ఫిన్ తో ఎంజాయ్ చేస్తే తప్పేంటి అని అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు విషయం దాగుంది. త్రిష వన్యప్రాణి సంరక్షుణ సంస్థ పెటాకు బ్రాండ్ అంబాసిడర్. భాద్యతాయుతమైన స్థానంలో ఉండి మూగజీవాలతో సరదాలు ఏంటని పలువురు త్రిషని నిలదీస్తున్నారు.

స్వేచ్చని హరించవచ్చా

స్వేచ్చని హరించవచ్చా

డాల్ఫిన్స్ సముద్రాల్లో స్వేచ్ఛగా జీవించాలి. కానీ వాటిని తీసుకుని వచ్చి ఇరుకైన ఈత కొలనులో బంధించడం ఏంటి. వాటితో సరదాలు తీర్చుకోవడం ఏంటి అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మేనేజర్ పరిదా తంబల్ త్రిషని ప్రశ్నించారు. మూగజీవాల్ని బంధించడం, వాటితో సరదాలు తీర్చుకోవడం స్వేచ్చని హరించడమే అవుతుందని పరిదా అన్నారు.

ఓ వైపు విమర్శలు మరో వైపు

ఓ వైపు విమర్శలు మరో వైపు

త్రిష డాల్ఫిన్ తో ఉన్న ఫోటోలు చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతుంటే మరికొందరు జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. దీనికి త్రిష ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X