Vedhika: దేవకన్య బికినీ వేస్తే ఇలానే ఉంటుందేమో.. థైస్ అందాలను మొత్తం చూపించేసిన వేదిక!
సోషల్ మీడియా వచ్చాక సౌత్ భామల గ్లామర్ షో ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అందరికి భాగా అర్ధమైంది. సరైన ప్లాట్ ఫామ్ దొరికితే నార్త్ బ్యూటీస్ కంటే గ్లామర్ షో విషయంలో తాము ముందు వరుసలో ఉంటామని ప్రూవ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కన్నడనాట నుంచి వచ్చే అందాల భామలలో ఎక్కువ మంది మంగళూరు, బెంగుళూరు నుంచి వస్తూ ఉంటారు.
వీరికి ఫ్యాషన్ లైఫ్ అనేది సర్వసాధారణం. ఇక వేదిక కూడా ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ అయితే గట్టిగానే పెంచేసింది. ఈ బ్యూటీ ఫొటోలు చూస్తే ఎవరైన సరే షాక్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా అమ్మడు ఆల్ మోస్ట్ బికినీలో కనిపించేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సక్సెస్: అవకాశాల కోసం ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేయడానికి అయిన స్టార్ బ్యూటీస్ సిద్ధం అయిపోతారు. ఇక కన్నడనాట నుంచి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ వేదిక. మద్రాసి అనే సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ముని మూవీతో మొదటి సక్సెస్ ని ఈ బ్యూటీ అందుకుంది.
టాలీవుడ్ ఎంట్రీ: తెలుగులో కళ్యాణ్ రామ్ కి జోడీగా విజయదశమి అనే సినిమాలో నటించింది. ఆ మూవీ ఆమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. తరువాత నారా రోహిత్ డెబ్యూ మూవీ బాణం సినిమాలో నటించింది. అది కూడా కమర్షియల్ హీరోయిన్ ఇమేజ్ ని వేదికకి ఇవ్వలేదు. అయితే మలయాళం నుంచి ఆఫర్స్ పెరగడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యింది.

బాలకృష్ణకి జోడీగా: వరుసగా మలయాళంలో సినిమాలు చేస్తూ వస్తుంది. 2019లో రూలర్ సినిమాలో బాలకృష్ణకి జోడీగా ఈ బ్యూటీ నటించింది. తరువాత బంగార్రాజు మూవీలో అప్సరసలలో ఒకరిగా కనిపించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు సినిమాలలో డీసెంట్ పాత్రలు చేసిన బయట మాత్రం అందాల ప్రదర్శన కోసం ఎలాంటి హద్దులు పెట్టుకోదు.
థైస్ అందాలు: ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఈ అమ్మడు అందాల ప్రదర్శనతో హిట్ పుట్టిస్తుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో తీరంలో అప్పుడే దిగి వచ్చిన అప్సరసలా అందాలతో మెరిసిపోతుంది. థైస్ అందాలు చూపిస్తూ ఈ బ్యూటీ తాపం పెంచేస్తుంది. గతంలోనే అమ్మడు బికినీలో కూడా కనిపించింది. ఇక ఇప్పుడు దాదాపు అదే తరహాలో హాట్ అందాలతో మతిపోగొట్టేసింది. అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

చేతినిండా సినిమాలు: ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఐదు సినిమాల వరకు ఉన్నాయి. అందులో సౌత్ లో నాలుగు భాషల చిత్రాలు ఉండటం విశేషం. సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ తో కూడా ఈ బ్యూటీ దూసుకుపోతుంది. అయితే మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్లో కూడా నటించాలని వేదిక గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక వెబ్ సీరీస్ లలో కూడా అవకాశం వస్తే చేయాలని చూస్తోంది. మరి ఈ గ్లామర్ డోస్ తో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాన్సులు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











