చేతిలో మందు గ్లాస్ పట్టుకొని..స్టైల్‌గా తిప్పుతూ.. విస్కీ బాటిల్‌తో హీరోయిన్ రెజీనా!

2005 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న గ్లామర్ బ్యూటీ రెజినా కాసాండ్రా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దాదాపు సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటోంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన నటనతో ఏదో ఒక విధంగా హైలెట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుందనే పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది. అయితే వివాదాల్లోకి చాలా తక్కువగా కనిపించే రెజీనా ఇటీవల ఒక విస్కీ బాటిల్ తో కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఆమెకు చాలా నెగిటివ్ గా కామెంట్స్ అందుతున్నట్లు అర్థమవుతోంది.

తొందరపడిన రెజీనా

తొందరపడిన రెజీనా

శివ మనసులో శృతి (ఎస్ఎంఎస్) అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రెజినా కాసాండ్రా ఆ తర్వాత కొత్త జంట, రా రా కృష్ణయ్య, పవర్ అనే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూ గా ఆఫర్స్ రావడం తో కాస్త తొందరపడి అనవసరమైన సినిమాలను కూడా సెలెక్ట్ చేసుకుంది.

లక్కీ బ్యూటీ..

లక్కీ బ్యూటీ..

ఈ బ్యూటీ అదృష్టం ఏమిటో గాని సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆఫర్స్ అయితే చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అయితే ఒక్క ఏడాదిలో మినిమమ్ మూడు లేదా నాలుగు సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఒకవేళ సినిమాలు అంతగా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రయోగాత్మకమైన కథలలో

ప్రయోగాత్మకమైన కథలలో

వివాదాల జోలికి వెళ్లకుండా సైలెంట్ గా మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రెజీనా అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన కథలలో కూడా నటిస్తోంది. నటిగా తన స్థాయిని కూడా పెంచుకోవాలని కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రల్లో నటిస్తోంది. అవసరం అయితే ఆ సినిమాలకు బడ్జెట్ ను బట్టే చాలా తక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వీలైనంతవరకు నటిగా తన స్థాయిని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

Recommended Video

Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
రెజీనా చేతిలో మందు గ్లాస్

రెజీనా చేతిలో మందు గ్లాస్

ఇక ఇటీవల కాలంలో రెజినా కాసాండ్రా ఇతర ప్రమోషనల్ వీడియోలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో అమ్మడు మొదటిసారి ఒక విస్కీ బాటిల్ కు సంబంధించిన ప్రమోషన్ లో కనిపించడంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. విస్కీ బాటిల్ తో పాటు మందు గ్లాస్ ను కూడా చేతిలో పట్టుకొని అమ్మడు చాలా కూల్ గా కనిపించింది. ఇక ఆల్కహాల్ ను ప్రమోట్ చేయవద్దు అని ఆమె అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విషయంపై రెజీనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X