పెంగ్విన్ పైనే ఆశలు పెట్టుకున్న మహానటి.. హిట్టయితేనే అందరికి మంచిది!
మహానటి సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న తరువాత యువ హీరోయిన్ కీర్తి సురేష్ కొత్త కథలను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా థ్రిల్లర్ కాన్సెప్ట్ లను కూడా ఓకే చేస్తోంది. నెక్స్ట్ పెంగ్విన్ సినిమాతో ఎలాగైనా మరో డిఫరెంట్ హిట్ అందుకోవాలని అనుకుంటోంది. అయితే ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా OTTలో రిలీజ్ కాబోతోంది.
ఈ రోజు అర్ధరాత్రి 12గంటలకు కీర్తి పెంగ్విన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుంది అనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా మొత్తంలో డజనుకి పైగా క్రేజ్ అందుకున్న సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు పెంగ్విన్ అయినా మంచి సక్సెస్ అయితే రాబోయే సినిమాలకు మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.

కీర్తి సురేష్ ఇంతవరకు ఇలాంటి డిఫరెంట్ కథలతో రాలేదు కాబట్టి మొదటి రోజు జనాలు ఎగబడి చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి పెంగ్విన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రజినీకాంత్ పేట సినిమాను డైరెక్ట్ చేసిన యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు ఆయన శిష్యుడు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించాడు.


Click it and Unblock the Notifications











