twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Meera Jasmine: మళ్ళీ హద్దులు దాటేసిన భద్ర హీరోయిన్.. చూస్తే మార్ఫింగ్ అంటారేమో..

    |

    మీరాజాస్మిన్ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తిచ్చే సినిమాలలో భద్ర ఒకటి. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న ఆమె కొన్నాళ్ల తర్వాత హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమకు అయితే దూరమైంది. ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత ఆమె ఆడియన్స్ కు షాక్ ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. రీసెంట్ గా అయితే మరోసారి ఊహించని గ్లామర్ షో తో ఆకట్టుకుంది. ఆ ఫోటో చూస్తే ఇది మార్ఫింగ్ చేశారేమో అనిపిస్తుంది. ఇక ఆ ఫోటో వివరాలలోకి వెళితే..

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా..

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా..

    ఒకప్పుడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపుని అందుకున్న మీరాజాస్మిన్ వరుసగా సినిమాలు చేసింది. అప్పట్లో ఆమె ఏడాదికి ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్స్ చక్రం తిప్పుతున్న సమయంలోనే ఆమె సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపును అందుకుంది.

    ప్రతీ ఇండస్ట్రీలో..

    ప్రతీ ఇండస్ట్రీలో..

    సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ నటించిన మీరాజాస్మిన్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని విజయాలను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ఈ బ్యూటీకి పందెంకోడి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ఇక తెలుగులో అయితే భద్ర సినిమాకు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో అలాగే మలయాళం లో కూడా ఆమెకు అలాంటి విషయాలే దక్కాయి.

    అప్పటి వరకు బిజీగా

    అప్పటి వరకు బిజీగా

    2003 తర్వాత చాలా బిజీగా మారిపోయిన మీరాజాస్మిన్ 2017 వరకు కూడా గ్యాప్ లేకుండా ప్రతీ ఏడాదిలో ఐదుకు పైగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అయితే 2011 తర్వాత మాత్రం ఆమె మళ్లీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఏదో మీడియం బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది కానీ అవి ఏమీ అంతగా సక్సెస్ కాలేదు. తెలుగులో చివరగా మోక్ష అనే ఒక సినిమాలో నటించింది.

    షాకింగ్ ఫొటో షూట్స్

    షాకింగ్ ఫొటో షూట్స్

    ఇక మీరాజాస్మిన్ ఇప్పుడైతే ఊహించని విధంగా మారిపోయింది. ఆమె ఒకప్పుడు సినిమాల్లో అయితే గ్లామరస్ పాత్రలో పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు 40 ఏళ్ల వయసులో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఫోటోలో కూడా అందాల ఆరబోతతో నేటితరం యువ హీరోయిన్స్ కు కూడా గట్టి పోటీని ఇస్తోంది.

    ఊహించని లుక్ వైరల్

    ఊహించని లుక్ వైరల్

    రీసెంట్ గా ఒక స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో మీరాజాస్మిన్ కనిపించిన విధానం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు ఆ ఫోటోలో ఉన్నది నిజంగా ఆమెనే అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఒక విధంగా మార్ఫింగ్ చేసినట్లు ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరాజాస్మిన్ ఆ ఫోటోలో తన నడుము అందాలను ఊహించిన విధంగా ప్రజెంట్ చేసింది. ఇక ఆ ఫోటో అయితే నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో మీరాజాస్మిన్ ఇంకా ఏ విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో చూడాలి.

    English summary
    South senior actress Meera Jasmine stunning look viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X