twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Trisha: పెళ్లికి ముందే విడాకులపై ఆలోచన..పెళ్లి మ్యాటర్ పై సూటిగా జవాబిచ్చిన త్రిష!

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరికొందరు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ తో హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇక ఇప్పుడున్న జనరేషన్లో కొందరు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యధావిధిగా నటిస్తున్నారు. అయితే అందులో విడిపోయిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష తన పెళ్లి గురించి ఎవరు ఊహించని విధంగా క్లారిటీ అయితే ఇచ్చింది. పెళ్లికి ముందే ఆమె విడాకుల విషయంలో కూడా చాలా దీర్ఘంగా ఆలోచించడం విశేషం. ఆ వివరాలలోకి వెళ్తే..

    20 ఏళ్ళ కెరీర్

    20 ఏళ్ళ కెరీర్

    ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న హీరోయిన్స్ లో త్రిష ఒకరు ఆమె గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆమె ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికీ కూడా మంచి పాత్రలతో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్స్ కు కూడా పోటీగా నిలుస్తోంది. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

    ప్రేమ, పెళ్లి?

    ప్రేమ, పెళ్లి?

    అయితే త్రిష పెళ్లి విషయంపై ప్రేమ విషయంపై చాలా రకాల రూమర్స్ అయితే వినిపించాయి. ముఖ్యంగా ఒక ప్రముఖ తెలుగు హీరోతో ప్రేమలో కొనసాగినట్లు అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది. అంతేకాకుండా ఒక బిజినెస్ మాన్ తో కూడా ఆమె ప్రేమలో పడి ఆ తర్వాత నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి మ్యాటర్ క్యాన్సల్ చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

     గత ఏడాది నుంచి

    గత ఏడాది నుంచి

    ఇక త్రిష గత ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు మరికొన్ని వార్తలు కూడా జోరుగా వైరల్ అయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా అదే తరహాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎవరు ఊహించని విధంగా ఒక సమాధానం అయితే ఇచ్చింది.

     అలా అడగడం నచ్చదు

    అలా అడగడం నచ్చదు

    త్రిష స్పందిస్తూ.. దాదాపు అందరూ కూడా పెళ్లి గురించి ఒకే తరహా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరు కూడా ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు అనే విషయాన్ని అడగకుండా వయసుతో దాన్ని ముడి పెట్టేసి 40 వస్తున్నాయి 50 ఏళ్ళు వస్తున్నాయి అంటూ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని విధంగా అడుగుతూ ఉండడం ఏమాత్రం నచ్చలేదు. వయసుతో పెళ్లికి ముడి పెట్టవలసిన అవసరం కూడా లేదు.. అని త్రిష చెప్పింది.

    చిన్న చిన్న కారణాలకు

    చిన్న చిన్న కారణాలకు

    అంతేకాకుండా బయట ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి క్లారిటీ ఇస్తూ చాలామంది చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకుంటున్నారు అని అవసరం లేని విషయాలను సాగుగా చెబుతూ విడిపోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని అంటూ కొంతమంది అయితే విడిపోవాలని ఉన్నా కూడా పిల్లల కోసం దేనికోసమో కష్టంగా మ్యారేజ్ లైఫ్ లో సంతోషం లేకుండా ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు అని చెప్పింది.

    అలాంటి వ్యక్తి కావాలి

    అలాంటి వ్యక్తి కావాలి

    ఇక తన పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చిన త్రిష సరైన వ్యక్తి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి అనేది నా దృష్టిలో లైఫ్ లాంగ్ కొనసాగే ఒక జర్నీ. దాన్ని ఒకేసారి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి కరెక్ట్ పర్సన్ దొరికితే ఆ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నాకు సరిపోయే సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లుగానే త్రిష చెప్పకనే చెప్పేసింది.

    English summary
    South senior heroine Trisha Krishnan latest clarification on marriage thoughts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X