Shruti Haasan: ఘాటైన డ్రెస్సులో శృతి హసన్ డేట్ నైట్.. అతనిపై పడిపోయి.. కొరికేస్తూ సరసాలు...
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. శృతి హాసన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా సొంత టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.
ఇక నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, రైటర్ గా పలు రకాల టాలెంట్స్ ఆమెలో ఉన్నాయి. ఇక శృతి తన పర్సనల్ లైఫ్ కూడా ఓపెన్ బుక్ అని చెప్పవచ్చు. ఆమె ప్రియుడితో ఉండే ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ గా పోస్ట్ అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది మొదట్లోనే బిగ్ హిట్స్: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సంక్రాంతికి రిలీజ్ కావడం విశేషం. దీని తర్వాత ప్రభాస్ కి జోడీగా నటిస్తోన్న సలార్ మూవీ షూటింగ్ కూడా శృతి హాసన్ కంప్లీట్ చేసుకుంది. ఎప్పుడో సలార్ మూవీకి శృతి ప్యాకప్ చెప్పేసింది.

చాలా మంది దర్శక నిర్మాతల నుంచి ఆఫర్స్: ఆ తరువాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా అమ్మడు కమిట్ అవ్వలేదు. శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ మాత్రం ఎవరితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే అప్పుడప్పుడు దర్శనం ఇస్తోంది.

ఎక్కువగా తన ప్రియుడితోనే: శృతి హాసన్ మెజారిటీ టైమ్ తన ప్రియుడు శాంతనుతో స్పెండ్ చేస్తోంది. అతనితో గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో శృతి హాసన్ ప్రొఫైల్ స్టొరీగా కొన్ని వీడియోలు పెట్టుకుంది. ఇందులో తన ప్రియుడు శాంతనుతో ఆమె ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది అనేది చూపిస్తోంది. తన ఫేవరేట్ హ్యూమన్, తన ఫేవరేట్ సిటీలో డేట్ నైట్ అంటూ ఫోటోలని పంచుకుంది.

బాయ్ ఫ్రెండ్ ను రెచ్చగొట్టేలా: ప్రస్తుతం ఈ అమ్మడు ప్రియుడు శాంతను హజారికాతో లండన్ లో సమ్మర్ హాలిడేని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్నట్లు ఈ వీడియో, ఫోటోల బట్టి తెలుస్తోంది. ఇక ఆమె పోస్ట్ చేసిన ఒక స్టోరీ వీడియోలో అయితే ఘాటైన గ్లామరస్ డ్రెస్సులో కనిపించి బాయ్ ఫ్రెండ్ ను రెచ్చగొట్టేలా దర్శనమిచ్చింది. అలాగే అతని మీద పడి కొరికేస్తున్నట్లు కనిలించింది. శృతి ప్రేమకు ప్రియుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది.

చాలా గ్యాప్ తర్వాత: ఇక ఈ సమ్మర్ వెకేషన్ పూర్తిచేసుకొని ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి శృతి హాసన్ ఏమైనా ఆలోచిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆమె ఏ సినిమాకి ఇప్పటి వరకు కమిట్ అవ్వలేదు. ఇదిలా ఉంటే శృతి హాసన్ గతంలో ఓక ఫారినర్ తో లవ్ లో పడింది. ఆ సమయంలో కూడా సినిమాల ఆఫర్స్ సైతం వదులుకొని ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో డేట్ లో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండేది.
అతనితో బ్రేక్ అప్ అయిన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో క్రాక్ సినిమాతో శృతి హాసన్ రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న సమయంలో శాంతనుతో లవ్ లో పడింది. దీంతో మరల సినిమాలని పక్కన పెట్టి అతని డేట్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











