twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులపై ధైర్యంగా మాట్లాడండి: సమంత పిలుపు

    |

    మీ టూ ఉద్యమం ఉధృతమైన తర్వాత హీరోయిన్ సమంత కూడా ముందుకు వచ్చి #మీటూ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ట్వీట్ చేశారు. ప్రతి మహిళ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పేందుకు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

    'ప్రతి ఒక్కరూ సెక్సువల్ హరాస్మెంట్ జరిగినపుడు చెప్పడానికి ధైర్యంగా ముందుకు రావలి. మీరు ఎవరో చెప్పకుండా ఇచ్చిన ఫిర్యాదైనా.. మీ వాయిస్ అందరికీ వినిపిస్తుంది.' అని సమంత వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేయాల్సిన ఈమెయిల్ ఐడీలను ఆమె షేర్ చేశారు.

    Speak up against sexual harassment: Samantha

    పోస్టు ద్వారా తమ ఫిర్యాదులు పంపించాలనుకునేవారు. డాక్టర్‌ డి. రామానాయుడు భవనం, ఫిల్మ్‌ నగర్‌, హైదరాబాద్‌, తెలంగాణ, 50096 చిరునామాకు పంపవచ్చని, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.... మీటూ గురించి ఎలాంటి ట్వీట్ కనిపించినా, ఈ విషయమై ఇతర నటీమణులు, ఇతర రంగాలకు చెందిన మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను రీ ట్వీట్ చేస్తున్నారు.

    English summary
    "Speak up against sexual harassment, Your voice will be heard even if it is anonymous Complain to complaintstelugufilmchamber.in, complaintsapfilmchamber.com, Postal address Panel against sexual harassment, Dr D Ramanaidu Building, Filmnagar Hyderabad, TELANGANA 500096." Samatha tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X