బాలీవుడ్ లో రకుల్ రేంజ్ మాములుగా లేదుగా.. షూటింగ్స్ కోసం హెలికాప్టర్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలు కరువయ్యాయనే చెప్పాలి. ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ భామ ముంబై కి మకాం మార్చింది కూడా. అయితే అక్కడ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న ఆమె లెవల్ పూర్తిగా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే.
Recommended Video

కన్నడ సినిమాతో ఎంట్రీ
సెల్వ రాఘవన్ 7జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్ అప్పటికి తనకు సినిమా అంటే తెలియదు అని చెబుతుంటుంది. మోడలింగ్ కి వచ్చే డబ్బు కంటే సినిమాల్లో చేస్తే వచ్చే డబ్బు ఎక్కువగా ఉంటుంది అని తెలియడంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నానని ఆమె చెబుతూ ఉంటుంది.
హిట్ కావడంతోఅలా కన్నడలో ఒక సినిమా చేసినా ఆమెకు అంత పేరు అయితే రాలేదు. అయితే ఆ తర్వాత తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దీనిని యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించగా ఆ సినిమా మంచి హిట్ కావడంతో మంచి పేరు దక్కించుకుంది.

చివరిగా కొండపోలంలో
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2 వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతే కాక బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ లాంటి సినిమాలు తెలుగులో చేసి ఆమె స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నాగార్జున సరసన మన్మధుడు సీక్వెల్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా ఇక్కడ కొండపోలం సినిమాలో ఆమె కనిపించింది.

బిజీ బిజీగా
దీంతో ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ఒకరకంగా ఆమె బిజీ బిజీగా గడుపుతోంది. ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆమె నటించిన, నటిస్తున్న సినిమాలు అరడజనుకు పైగా ఉండగా అందులో రెండు సినిమాల షూటింగ్స్ శుక్రవారం జరిగాయి. ఒకటి... అజయ్ దేవగన్ 'రన్ వే 34' ఒక సినిమా కాగా మరొకటి ఆమె కండోమ్ టెస్టర్‌గా నటిస్తున్న 'ఛత్రీవాలీ'.

స్పెషల్‌గా హెలికాఫ్టర్ అరేంజ్ చేసి
అజయ్ దేవగన్ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం ముంబై సిటీలో జరిగింది. మధ్యాహ్నం తర్వాత పుణెలో 'ఛత్రీవాలీ' షూటింగ్ జరిగింది. రకుల్ కోసం ముంబై నుంచి పుణె వెళ్లడానికి ఓ సినిమా యూనిట్ స్పెషల్‌గా హెలికాఫ్టర్ అరేంజ్ చేసిందని తెలుస్తోంది. అందులో ఆమె ట్రావెల్ చేసి వెళ్లి షూట్ లో పాల్గొందట. అయితే ముంబై నుంచి పూణేకి విమాన సర్వీసులు ఉన్నా ఫ్లైట్లు ఎప్పుడు పడితే అపుడు ఉండవు, అందుకే వేల్ల్లాలి అంటే టైమ్ ఎక్కువ పడుతుంది. అదే ప్రైవేటు ఛాపర్ అంటే త్వరగా ట్రావెల్ చేయవచ్చని అలా ప్లాన్ చేశారట.


Click it and Unblock the Notifications











