Skanda- The Attacker: శ్రీలీల, రామ్ హాట్ రొమాన్స్.... పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు

శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయం, డ్యాన్స్, యాక్టింగ్.. ఇలా అన్నింట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది. శ్రీలీల చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ తో కలిసి శ్రీలీల స్కంధ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ కాగా... ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. పెళ్లిసందడి సినిమాతో ఈ కన్నడ భామ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ధమాకా మూవీలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

Skanda

ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు శ్రీలీల ఓ ఛాన్స్ లా కనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం కొట్టేస్తున్న ఈ బ్యూటీ.. డే అండ్ నైట్ షూట్ లతో బిజీగా లైఫ్ ను గడుపుతుంది. ఈమె చేతిలో బాలయ్య భగవంత్ కేసరి, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ గుంటురు కారం, నితిన్ ఎక్స్ ట్రా ఆర్టినరి మ్యాన్, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, రామ్ స్కంధ వంటి చిత్రాలే కాకుండా నితిన్ నార్నే, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా నటిస్తోంది.

ఇక బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం స్కంధ. ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సరైనోడు, అఖండ బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఈ సినిమాకు ఎస్. ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రామ్ మొదటిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్కంద' చిత్రం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా...మేకర్స్ సెకండ్ సింగిల్ గందారబాయి లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది.

ఎస్ఎస్ తమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారని చెప్పవచ్చు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే... గందారబాయి మాస్ ధమకే ధార్ ఫోక్లోర్ బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.

రామ్, శ్రీలీల తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లని తెలిసిన విషయమే. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాట కు కొరియోగ్రఫీ చేశారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా 'స్కంద' విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X