పవన్ కల్యాణ్‌పై శ్రీలీల హాట్ కామెంట్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌పై బ్యూటీ ఏమన్నందంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ వై నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో యంగ్ హార్ట్ థ్రోబ్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజై 11 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీలీల చేసిన ట్వీట్ ఏమిటి? ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

అధర్మం రాజ్యమేలినప్పుడు: ప్రతీ తరంలో అధర్మ రాజ్యమేలుతున్నప్పుడు భగవంతుడు విభిన్నమైన అవతారాల్లో వస్తుంటాడు అంటూ ఘంటసాల పాడిన భగవద్గీత శ్లోకంతో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని భగత్ సింగ్ ఎంట్రీ ఇస్తాడు. పత్తర్ గంజ్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారిగా లుంగీతో వెనుక పిస్టల్‌తో ఎంట్రీ ఇస్తాడు. పోలీస్ జీప్‌లో నుంచి ఒక్క ఉదుటన దూకేసి గ్రాండ్‌గా, మాస్‌గా పరిచయం అవుతాడు.

మాస్ అవతారం..ట్రేడ్ మార్క్ మేనరిజం: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో మసీదు వద్ద తన మాస్ అవతారంతో, తన ట్రేడ్ మార్క్ మేనరిజంతో పవన్ కల్యాణ్ ఆకట్టుకొన్నాడు.శ్రీలీలను ఓ సీన్‌లో రొమాంటిక్‌గా టీజ్ చేస్తూ కనిపించాడు. ఆవేశంలో ఉన్న ఆయనను పోలీసులు ఆపడం గ్లింప్స్‌లో కనిపించాడు. ఆత ర్వాత ఈ సారి ఫెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్‌తో గ్లింప్స్ అదిరిపోయింది. గ్లింప్స్ చూసిన అభిమానులు శివమెత్తినట్టు ఊగిపోయారు.
11 ఏళ్లుగా ఆకలితో వేచి చూశాను: మీ ప్రేమకు చిహ్నంగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ అందించాను. గత 11 ఏళ్లుగా ఈ క్షణం కోసం వేచి చూశాను. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ తర్వాత సినిమా ఎప్పుడు చేద్దామని ఎదురు చూశాను. నాలోని ఆకలికి సాక్షమే ఉస్తాద్ గబ్బర్ సింగ్ గ్లింప్స్. ఈ గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌కు అంకితం ఇస్తున్నాను. ఫ్యాన్ చేతనే ఈ గ్లింప్స్‌ను ఆవిష్కరిస్తున్నాం. పవన్ కల్యాణ్ అభిమాని సతీష్‌తో ప్రారంభిస్తున్నాం అని హరీష్ శంకర్ అన్నారు.

హాట్‌గా శ్రీలీల కామెంట్స్: ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన శ్రీలీల ట్వీట్ చేస్తూ.. మంచి బ్యాంగ్‌తో గబ్బర్ సింగ్ మళ్లీ వచ్చాడు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ లాంటి డైనమెట్లతో పనిచేయడం అద్బుతమైన అనుభూతి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అని గ్లింప్స్‌ను శ్రీలీల షేర్ చేసింది.

అభిమానుల కోలాహాలం మధ్య: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన వేడుకలో నిర్మాత నవీన్, దర్శకుడు హరీష్ శంకర్, ఎడిటర్ చోటా కే ప్రసాద్, దర్శకుడు దశరథ్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంలో అశుతోష్ రానా; గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











