RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పెళ్లి సందD హీరోయిన్.. అసలు ఆమెకు RRRకి లింక్ ఏంటో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. తెలుగులో రెండు పెద్ద సినిమా కుటుంబాలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఇద్దరు హీరోల అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి సహా రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. తాజాగా చిక్కబళ్లాపూర్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో అనూహ్యంగా మెరిసింది హీరోయిన్ శ్రీ లీల. RRR హీరోయిన్లు సైతం హాజరు కాని ఈ సినిమా ఈవెంట్ కు ఆమె ఎందుకు హాజరు అయింది? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

గ్రాండ్‎గా విడుదల

గ్రాండ్‎గా విడుదల

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన RRR సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ కథానాయికలుగా నటించగా అజయ్​ దేవ్ గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 25న పాన్ వరల్డ్ లెవల్లో గ్రాండ్‎గా విడుదల చేస్తున్నారు.

వరుస టూర్లు

వరుస టూర్లు

RRR సినిమా ప్రమోషన్స్ కు ఇప్పటికే చాలా సార్లు చేశారు. కానీ సినిమా వాయిదా పడడంతో మళ్ళీ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడటంతో మరికొన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోంది. 6 రోజుల సమయంలో 9 నగరాల్లోని సినీ ప్రియులను కలవడానికి ప్లాన్ చేశారు.1అలా 8న దుబాయ్‌లో ఈవెంట్ నిర్వహించగా, 19న బెంగళూరు, చిక్ బళ్లాపూర్ ఈవెంట్ లు నిర్వహించారు. 20న బరోడా, ఢిల్లీ, 21న అమృత్‌సర్‌, జైపుర్‌, 22న కోల్‌కతా, వారణాసి, 23న హైదరాబాద్‌లో ఈవెంట్ లు జరపనుంది.

ఆకట్టుకున్నారు

అయితే చిక్కబళ్లాపూర్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కర్ణాటక వైద్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ కూడా అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఈవెంట్ వైభవంగా సాగింది. ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. జక్కన్న కూడా మెగాస్టార్ గొప్పదనం ఏంటో చెప్పి ఆకట్టుకున్నారు.

సంబంధం ఉందా?

సంబంధం ఉందా?

అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మరో యంగ్ బ్యూటీ అందరినీ ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు.. పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల. తొలి చిత్రంతోనే తన హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో శ్రీ లీల మెస్మరైజ్ చేసి వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే అసలు శ్రీ లీలకి RRRకి ఏంటి కనెక్షన్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు సినిమా తారాగణం లేదా ఈవెంట్ నిర్వాహకులకు ఎవరైనా సంబంధం ఉందా? లేక ఆమె ఈ కార్యక్రమానికి క్యాజువల్‌గా హాజరైందా? అని చర్చ జరుగుతోంది.

 గాసిప్స్ సృష్టిస్తోంది కానీ

గాసిప్స్ సృష్టిస్తోంది కానీ

కన్నడ మీడియా అయితే.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో శ్రీ లీల ఛాన్స్ దక్కించుకుంది అని కూడా గాసిప్స్ సృష్టిస్తోంది. కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. కర్ణాటకలో RRR సినిమాను రిలీజ్ చేస్తున్న కె వి ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత వెంకట్ తో శ్రీ లీల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది కెవిఎన్ సంస్థ కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రీ లీలకి కూడా ఆహ్వానం అందింది. అలా హాజరైన ఆమె RRR ఈవెంట్‌ను పూర్తిగా ఆస్వాదించినట్లు కనిపించింది.

రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం

రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం

ఇక పెళ్లి సందడితో శ్రీ లీల తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె ఇప్పటికే రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసింది, అందులో ఒకటి రవితేజ యొక్క ధమాకా కాగా మరొకటి వారాహి బ్యానర్ లో తెరకెక్కిస్తున్న గాలి జనార్ధన్ రెడ్డి సినిమా. ఆ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తూ ఉండగా ఆ సినిమా ఓపెనింగ్ కు కూడా రాజమౌళి హాజరయ్యారు.

మరి వారాహి సంస్థ తరఫున ఏమైనా ఆమె హాజరైయిండా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది. ఆమె బెంగళూరులో పుట్టిపెరిగిన తెలుగమ్మాయు కావడంతో ఆమెకు అటు కన్నడ, ఇటు తెలుగు అభిమానులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఏదైతేనేం శ్రీ లీల ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు హుషారుగా క్లాప్స్ కొట్టి ఛీర్ చేసింది. అలాగే రామ్ చరణ్ చేతుల మీదుగా మొమెంటో కూడా అందుకుంది ఈ బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X