ఒకే స్టార్ హీరోతో శ్రీలీల, సాయిపల్లవి.. తెరపై రొమాంటిక్ మ్యాజిక్ రెడీ!

సౌత్‌లో స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో నటించనున్న 55వ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చెన్నైలో చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆ ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ చిత్రాన్ని ధనుష్ సొంత సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమాకు అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

ధనుష్‌ను తొలిసారి డైరెక్ట్ చేస్తున్న D55 సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లు శ్రీలీల, సాయిపల్లవిని రంగంలోకి దించారు. అలాగే దక్షిణాదిలో లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.

Sreeleela and Sai Pallavi to pair with Dhanush D55

గతంలో రాజ్‌కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో అమరన్ చిత్రంలో సాయిపల్లవి నటించారు. అలాగే ధనుష్‌తో కూడా మారి 2 సాయిపల్లవి నటించడం తెలిసిందే. ఆ ఇద్దరి జోడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరోసారి ఈ క్రేజీ జంట ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. అయితే ధనుష్‌తో శ్రీలీల నటించడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తమిళ చిత్రంలో ఏడేళ్ల తర్వాత మమ్ముట్టి నటిస్తున్నారు. 2019 సంవత్సరంలో పెరంబు చిత్రంలో చివరిసారిగా కోలీవుడ్ చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ పాత్ర ఆయన ఆకట్టుకొన్నది. దర్శకుడు చెప్పిన కథ కూడా నచ్చడంతో వెంటనే ఒప్పుకొన్నారు. ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇక ఫిబ్రవరి 6వ తేదీన చెన్నైలో నిరాడంబరంగా జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో శ్రీలీల, సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిద్దరూ ధనుష్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత హీరోతో కలిసి మీడియా కోసం ఫోటోలకు ఫోజిలిచ్చారు. ఈ సినిమాు ఆర్ టేక్ స్టూడియోస్ సహభాగస్వామిగా ఉన్నారు.

Sreeleela and Sai Pallavi to pair with Dhanush

ఇక ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపికకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను గోపురం ఫిల్మ్ బ్యానర్‌పై అంబు చెజియన్, సుస్మితా చెజియన్ నిర్మించాలని అనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ధనుష్ ఈ సినిమాకు నిర్మాతగా మారారు అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: sreeleela sai pallavi dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X