250 ఏళ్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మైసూర్ శాండల్ సోప్‌కు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కన్నడ సీమ రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 6.2 కోట్ల పారితోషికంతో తమన్నాకు ఈ బాధ్యతను కట్టబెట్టింది సిద్ధరామయ్య ప్రభుత్వం. అయితే కర్ణాటకలో ఎంతో మంది ప్రముఖులు, ప్రతిభావంతులు ఉండగా పరాయి రాష్ట్రానికి చెందిన నటిని మైసూర్ శాండల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక సంఘాలు, పార్టీలు, ప్రముఖులు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకి చెందిన యువ కథానాయిక శ్రీలీల అదిరిపోయే ఆఫర్ అందుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
చేతినిండా సినిమాలతో శ్రీలీల బిజీ
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా వినిపించే పేరు శ్రీలీల. ధమాకాతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ ముద్దగుమ్మ ఆ తర్వాత భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక పుష్ప 2లో కిస్సిక్ సాంగ్‌తో దేశాన్ని ఊపేసి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యింది. అందం, అభినయం, డ్యాన్స్‌తో క్రేజీ ఆఫర్లు పట్టేస్తోంది. చాలా చిన్న వయసులోనే బాలీవుడ్ ఆఫర్ కూడా అందుకోవడంతో శ్రీలీల అదృష్టంపై సీనియర్ హీరోయిన్లు, అప్ కమింగ్ హీరోయిన్లు అసూయ పడుతున్నారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమ వల్ల కానిది శ్రీలీల ఈజీగా సాధిస్తోందని కుళ్లుకుంటున్నారు.

ఆషికి 3తో బాలీవుడ్‌లోకి
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికి 3 అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు శ్రీలీల. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకుడు. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా శరవేగంగా సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు అనురాగ్. అయితే అషికి 3 ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన శ్రీలీల ఆడిపడనుందట. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాజ్ సాండియాలా దర్శకత్వం వహిస్తారని బీటౌన్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక తెలుగులో జూనియర్, మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు.
టాప్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా
సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇక బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోందట. న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా వుమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్‌కు శ్రీలీల అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల అండార్స్‌మెంట్స్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది.
శ్రీలీలతో యూకే కంపెనీ డీల్
పర్సనల్ కేర్, కాస్మోటిక్స్, ఫ్రాగ్‌రెన్సెస్ విభాగంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన యార్డ్లే లండన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి దాదాపు 255 ఏళ్ల చరిత్ర ఉండగా.. ప్రపంచంలోని అత్యంత పురాతన కంపెనీల్లో ఒకటిగా యార్డ్లేకు పేరుంది. 2009లో యార్డ్లేను భారత కార్పోరేట్ దిగ్గజం విప్రో ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ సంస్థలోని ఫ్రాగ్‌రెన్సెస్ విభాగానికి గాను భారత్‌లో శ్రీలీల ప్రమోట్ చేయనుండటం విశేషం.
పారితోషికం ఎంతంటే?
అయితే ఇందుకు గాను శ్రీలీల ఎంత మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారన్నది తెలియరాలేదు. ప్రస్తుతం బ్రాండ్ ప్రమోషనింగ్ కోసం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య శ్రీలీల ఛార్జ్ చేస్తుండటంతో ఇది కూడా అదే స్థాయిలో లేదా ఆపైనా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యార్డ్లే నుంచి శ్రీలీల పారితోషికంగా ఎంత మొత్తం వసూలు చేస్తున్నారనే దానిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











