Sreeleela: సోషల్ మీడియాలో కెలికిన బాలీవుడ్ హీరో.. చెంపపెట్టులా శ్రీలీల దిమ్మతిరిగే కౌంటర్!

కన్నడ సినిమా రంగంలో ప్రవేశించి ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిన శ్రీలీల ప్రస్తుతం జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకొనేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి.. పలు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకొని సెన్సేషన్‌గా నిలిచారు. తెలుగు సినిమాలు నటించడం కొంత తగ్గించుకొని ఇప్పుడు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ హీరోలతో చనువుగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరో చేసిన సెటైర్‌పై శ్రీలీల ఫన్నీగా స్పందించినప్పటీకి.. అది నెటిజన్లకు ఘాటుగానే కనిపించింది. ఆ హీరోకు ఇచ్చిన నాటు సమాధానం ఏమిటంటే?

పెళ్లి సందD మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా చిత్రంతో 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకొన్నది. ఆ చిత్రంలో రవితేజ హీరోగా నటించినప్పటికీ.. తన డ్యాన్సులు, యాక్టింగ్ కారణంగానే హిట్ అయిందనే టాక్ ఇండస్ట్రీ, క్రిటిక్స్ నుంచి వచ్చింది. ధమాకా తర్వాత ఆమెను వరుస ఆఫర్లు పలకరించడంతో క్షణం తీరికలేకుండా షూటింగులతో బిజీగా మారిపోయారు. మహేష్ బాబు, రవితేజ నుంచి బాలకృష్ణ వరకు.. ఇంకా యువ హీరోలతో జతకట్టింది. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో హిందీ సినిమా రంగంపై ఫోకస్ పెట్టింది.

Sreeleela

హిందీలో టాప్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఆషికీ 3 చిత్రంలో నటిస్తున్నారు. కోల్‌కతా, డార్జిలింగ్, షిల్లాంగ్ ప్రాంతాల్లో షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకొన్నారు. అయితే ఈ షూటింగ్ సమయంలోనే కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో హైలెట్ అయింది. అయితే ఈ డేటింగ్ వారిద్దరి మధ్య లవ్ అఫైర్‌గా మారింది అని బాలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది. వారిద్దరి కలిసి తిరగడం మీడియాకు స్పెషల్ అటెన్షన్‌గా మారింది.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో శ్రీలీల యమ యాక్టివ్‌గా కనిపిస్తారు. తాను ధరించే అభరణాలు, దుస్తులకు సంబంధించిన ఫోటోలు, అలాగే సినిమా షూటింగులు, తన చిత్రాల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. అయితే తాజాగా తన సమ్మర్ డ్రస్సుల గురించి శ్రీలీల ఓ పోస్టు పెట్టి దాని కింద రాసిన మెసేజ్‌పై బాలీవుడ్ యువ హీరో ఇబ్రహీం అలీ ఖాన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడం ఫన్నీగా మారింది.

శ్రీలీల ఓ పోస్టు ఇలా పెడుతూ.. ఈ నెల మే నెల.. ఈ నెలలో వర్షాలు పడొచ్చు. లేదా పడకపోవచ్చు. అయితే వేసవి తాపం ఎక్కువగానే ఉండొచ్చు (Just realised why this month is called MAY. It MAY rain. It MAY not. It MAY be hot. Cause honestly, why not) అంటూ పోయేటిక్‌గా తన మనసులో భావాలను అక్షర రూపంలోకి మార్చుకొన్నది. ఆ పోస్టు పెట్టిన కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. వేల మంది నెటిజన్లు, సినీ ప్రముఖులు దానిని లైక్ చేశారు.

ఇక శ్రీలీల పెట్టిన ఆ పోస్టు గురించి ఇబ్రహీం ఆలీ ఖాన్ చిలిపిగా, సెటైరికల్‌గా స్పందిస్తూ.. మీరు పోస్టు చేసిన నీ ఫోటోల కంటే.. మీరు రాసిన క్యాప్షన్ మాత్రమే బాగుంది అనే విధంగా రిప్లై ఇచ్చాడు. దానికి శ్రీలీల స్పందిస్తూ... ఓకే షేక్‌స్పియర్.. మీరు అనుకొన్నట్టు నా క్రియేటివిటీ అంతే ఉంది అనే విధంగా కామెంట్ చేసింది. వారిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

Sreeleela

ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే... ఇటీవల ఆమె నటించిన రాబిన్‌హుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం జూనియర్ అనే కన్నడ సినిమాలోను, అలాగే రవితేజతో మాస్ జాతర, కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3, పరాశక్తి అనే తమిళ సినిమాలోను, అలాగే అఖిల్ అక్కినేనితో లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X