Sreeleela: రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? శ్రీలీల క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల (Sreeleela)స్టేజ్‌పై సీరియస్‌గా చూసినట్లు కనిపించిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె చూపు రంగస్థలం మహేష్ వైపే అన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో 'అసలు ఏమైంది?', 'మహేష్ ఏం చేశాడు?' అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా శ్రీలీల స్పందించారు. అసలు విషయం ఏంటో క్లారిటీ ఇచ్చారు.

అసలు ఏమైంది? శ్రీలీల క్లారిటీ
ఇటీవల ఇచ్చిన వివరణలో శ్రీలీల మాట్లాడుతూ..'ఆ వీడియో గురించి ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. కానీ నిజానికి అక్కడ ఎలాంటి వివాదం జరగలేదు. అది పూర్తిగా మిస్ కమ్యూనికేషన్ మాత్రమే' అని స్పష్టం చేశారు. ఆమె వివరించిన ప్రకారం.. ఈవెంట్ సమయంలో అకస్మాత్తుగా ఒక బీప్ సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూసినట్లు చెప్పారు. అదే సమయంలో తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని గుర్తొచ్చిందని తెలిపారు. స్టేజ్‌పైకి వెళ్లే ముందు మహేష్ తనకు సహాయం చేశారని, ఫోన్ కూడా ఆయన దగ్గరే ఉంచానని చెప్పారు.

Sreeleela Clarifies Viral Video With Mahesh Achanta at Ustaad Bhagat Singh Event

'నేను ఫోన్ కోసం చూసాను.. ఆయన నేను ఫోన్ గురించే చూస్తున్నానని అనుకున్నారు. అలాగే నేను ఆ సౌండ్ వైపు కూడా చూసాను. అలా ఒకరికొకరం సైగలతో కమ్యూనికేట్ చేసుకున్నాం. అంతే తప్ప ఎలాంటి ఇష్యూ లేదు' అని క్లియర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందిస్తూ శ్రీలీల..'మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏమీ జరగలేదు. ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న క్లిప్పింగ్స్ పెద్దగా చూపించడం సాధారణమే. ఇది పూర్తిగా మిస్ అండర్‌స్టాండింగ్'అని పేర్కొన్నారు.

అలాగే మహేష్ గురించి మాట్లాడుతూ... 'ఈ సినిమాలో ఆయనతో చాలా సీన్స్ చేశాను. చాలా మంచి వ్యక్తి. ఆయనను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు'అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి శ్రీలీల ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలాంటి నిజం లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు' అన్నారు. 'ఏదైనా విషయం ఉంటే మేమే ముందుకు వచ్చి చెప్తాం. కానీ ఇలా వీడియోల ఆధారంగా అపార్థాలు చేసుకుని ఇతరులను ఇబ్బంది పెట్టకండి' అంటూ నెటిజన్లను కోరారు.

అంతకుముందు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మహేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈవెంట్‌కు ముందు శ్రీలీల తన ఫోన్‌ను కొద్దిసేపు తన దగ్గర పెట్టుకోవాలని ఇచ్చిందని తెలిపారు. తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఫోన్ కోసం చూస్తున్నారనుకున్నానని చెప్పారు. కానీ వెంటనే ఆమె పైకి స్క్రీన్ వైపు చూసిందని, ఆ క్షణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. 'అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. దయచేసి ఎవరికీ అగౌరవం కలిగించేలా వ్యాఖ్యలు చేయకండి' అంటూ మహేష్ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

ఇలా చిన్న అపార్థం వల్ల పెద్ద కాంట్రవర్సీగా మారిన ఈ విషయం పై శ్రీలీల ఇచ్చిన క్లారిటీతో నిజం బయటపడింది. వైరల్ వీడియోల ఆధారంగా తక్షణ నిర్ణయాలకు రావద్దని, నిజానిజాలు తెలుసుకుని స్పందించాలని ఆమె సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X