BoyapatiRAPO First Thunder ఆ ఇద్దరితో కష్టమే. బోయపాటి, రామ్ పోతినేనిపై శ్రీలీల హాట్ కామెంట్!
యువ హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌పరంగానే కాకుండా ఫెర్పార్మెన్స్ పరంగా ఆకట్టుకొంటున్నారు. ఆమె నటించిన సినిమాలు భారీ విజయాలు అందుకోవడంతో కొద్దికాలంలోనే శ్రీలీల టాప్ స్టార్‌గా మారిపోయారు. పెళ్లిసందD మూవీతో కెరీర్ ఆరంభించిన ఈ అందాల భామ ప్రస్తుతం చేతిలో అరడజన్ చిత్రాలతో దూసుకెళ్తున్నది. అయితే బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫస్ట్ థండర్ మోషన్ పొస్టర్ రిలీజ్ అయింది. ఈ మోషన్ పోస్టర్ గురించి శ్రీలీల హాట్ కామెంట్స్ చేశారు. శ్రీలీల నటిస్తున్న సినిమాలు.. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమా వివరాల్లోకి వెళితే..
టాప్ హీరోలతో శ్రీలీల:ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ప్రాజెక్టులతో శ్రీలీల కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నది. పవన్ కల్యాణ్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు లాంటి అగ్రహీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో నటిస్తున్నది. ఉస్తాద్ భగత్ సింగ్, వైష్ణవ్ తేజ్ చిత్రాలతోపాటు రామ్ పోతినేని సినిమా లుక్స్, గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవితో ధమాకా భామ:ఇక శ్రీలీల ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నట్టు తెలుస్తున్నది. మలయాళ చిత్రం బ్రో డాడీ సినిమాలోని పాత్ర కోసం నిర్మాత కొణిదెల సుస్మిత పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవీతోపాటు సిద్దు జొన్నలగడ్డతో కలిసి శ్రీలీల నటించనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

ఉస్తాద్ భగత్ సింగ్‌తో శ్రీలీల:ఇక ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత శ్రీలీల ట్వీట్ వైరల్ అయింది. గబ్బర్ సింగ్ మళ్లీ భారీ బ్యాంగ్‌తో వచ్చేస్తున్నాడు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ లాంటి టీమ్‌తో నటించడం గర్వంగా ఉంది. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరు డైనమెట్స్ లాంటి వారు అంటూ కామెంట్ చేసింది.

రామ్ పోతినేని ఫస్ట్ థండర్:తాజాగా బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించిన ఫస్ట్ థండర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ థండర్ గురించి కామెంట్ చేస్తూ.. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను లాంటి బలమైన ఫోర్స్ కలిసి వస్తే..ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. థండరస్ గ్లింప్స్ మామూలుగా లేదుగా అంటూ శ్రీలీల ట్వీట్‌లో పేర్కొన్నది.
శ్రీలీల పాన్ ఇండియా స్టార్‌గా:
ఇదిలా ఉండగా, రామ్ పోతినేని సినిమాతో శ్రీలీల పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా సాంకేతిక వివరాల్లోకి వెళితే..
కథ, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 2023-10-20


Click it and Unblock the Notifications











